Health Tips: పెళ్లైన మగాళ్లకే ఈ న్యూస్.. రాత్రి పడుకునే ముందు ఈ పదార్థాలు తింటే రెచ్చిపోతారట..!

|

Jun 16, 2022 | 6:40 AM

Health Tips: సాదారణంగానే ప్రకృతిలో లభించే ప్రతి ఫలం వ్యక్తి ఆరోగ్యానికి ఏదోవిధంగా మేలు చేస్తుంది. ఇందులో ముఖ్యంగా దానిమ్మ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి.

Health Tips: పెళ్లైన మగాళ్లకే ఈ న్యూస్.. రాత్రి పడుకునే ముందు ఈ పదార్థాలు తింటే రెచ్చిపోతారట..!
Men Health
Follow us on

Health Tips: సాదారణంగానే ప్రకృతిలో లభించే ప్రతి ఫలం వ్యక్తి ఆరోగ్యానికి ఏదోవిధంగా మేలు చేస్తుంది. ఇందులో ముఖ్యంగా దానిమ్మ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీనిని తినడం వలన శరీరంలో రక్తం పెరుగుతుంది. హిమోగ్లోబిన్‌‌ను పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి.. శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని కూడా ఇస్తుంది. అదే సమయంలో ఈ దానిమ్మ పండు లైంగిక జీవితంలో కూడా ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శృంగార జీవితాన్ని ఆహ్లాదకరంగా, సంతోషంగా చేయడానికి దానిమ్మ రసం ఒక వరం లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఎవరైతే(మగాళ్లు) లైంగిక సమస్యలతో బాధపడుతన్నట్లయితే.. వారు దానిమ్మ పండు తింటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగానే చాలా మంది రోజూ దానిమ్మ పళ్లను తింటారు. అయితే, దాని ప్రయోజనాలు అందాలంటే.. రాత్రి సమయంలోనే తినాలట. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు దానిమ్మ గింజలను తింటే ఫలితం ఉంటుందట. ఇది సంతానోత్పత్తి, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

దానిమ్మలో పోషకాలు ఏమిటి?
దానిమ్మలో 6 గ్రాముల ఫైబర్, 2.5 గ్రాముల ప్రోటీన్, 29 శాతం రోజువారీ విటమిన్ సి, 35 శాతం విటమిన్ K, 16 శాతం ఫోలేట్ ఉన్నాయి. అంతే కాదు.. కనీసం 11% రోజువారీ పొటాషియం, 22 గ్రాముల మేర చక్కెర, 140 కేలరీల శక్తి ఉంది. గ్రీన్ టీ లేదా మరే ఇతర పానీయాల కంటే దానిమ్మలో మూడు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

పచ్చి ఉల్లిపాయ, అల్లం..
మీ దాంపత్యాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి అల్లం, పచ్చి ఉల్లిపాయలను కూడా తినవచ్చు. అల్లం తినడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి. మీ శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే శక్తి దీనికి ఉంది. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మీ శరీరంలో లైంగిక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. మంచి లైంగిక జీవితానికి హార్మోన్లు చాలా అవసరం. ఇది కాకుండా, పచ్చి ఉల్లిపాయ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనంతో పాటు సులభంగా తినే ఉల్లిపాయ మీ శృంగార జీవితానికి చాలా మేలు చేస్తుంది. కావున రోజూ మీ ఆహారంలో ఉల్లిపాయలను చేర్చుకోండి.