Health: బాదం మంచిదని పిల్లలకు తెగ తినిపిస్తున్నారా.? ఇది తెలుసుకోండి..

|

Feb 10, 2024 | 5:28 PM

ఇక బాదం చిన్నపిల్లలకు కూడా మంచి చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. చిన్నారులకు ప్రతీ రోజూ బాదం ఇవ్వాలని చెబుతుంటారు. అయితే మంచిది కదా అని ఎక్కువ ఇస్తే మాత్రం మొదటికే మోసం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చిన్నారులకు రోజుకు ఎన్ని బాదంలు ఇవ్వాలి.?

Health: బాదం మంచిదని పిల్లలకు తెగ తినిపిస్తున్నారా.? ఇది తెలుసుకోండి..
Health
Follow us on

బాదం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. విటమిన్‌ ఇకి పెట్టిందిపేరైన బాదం, మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంతోపాటు, ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

ఇక బాదం చిన్నపిల్లలకు కూడా మంచి చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. చిన్నారులకు ప్రతీ రోజూ బాదం ఇవ్వాలని చెబుతుంటారు. అయితే మంచిది కదా అని ఎక్కువ ఇస్తే మాత్రం మొదటికే మోసం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చిన్నారులకు రోజుకు ఎన్ని బాదంలు ఇవ్వాలి.? ఏ వయసు వారు ఎన్ని బాదంలు తినొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. హార్వర్డ్ టీహెచ్‌ చాన్ ప్రకారం, విటమిన్ E అనేది యాంటీఆక్సిడెంట్ విటమిన్, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. బాదంపప్పు తినడం వల్ల గుండె ధమనులలో గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 1 నుంచి 3 ఏళ్ల వయసున్న పిల్లలు రోజుకు 3 నుంచి 4 బాదంలు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే 4 నుంచి 8 ఏళ్ల వయసున్న చిన్నారులకు రోజుకు 5 నుంచి 8 బాదంలను ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక 9 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు రోజుకు 8 నుంచి 10 బాదం పలుకులు ఇవ్వొచ్చని చెబుతున్నారు. కాగా.. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం, బాదంలో ప్రోటీన్, విటమిన్ E, ఫైబర్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

అయితే.. బాదంను అధికంగా తినడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దీని కారణంగా కేలరీల పరిమాణం వేగంగా పెరుగుతుంది. అయితే, ఈ రకమైన కొవ్వు ఆరోగ్యానికి మంచిది. కానీ దీన్ని ఎక్కువగా తినడం వల్ల మొత్తం కేలరీల తీసుకోవడం పెరుగుతుంది. దీని కారణంగా బరువు పెరగవచ్చుని చెబుతున్నారు. అలాగే బాదంలో ఫైబ్‌ పుష్కలంగా ఉంటుంది. బాదం తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి మంచిదిని చెబుతుంటారు. కానీ అతిగా తీసుకుంటే మాత్రం పేగు వాపునకు దారి తీస్తుందని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..