Healty Care: ప్రతి ఇద్దరిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని అస్సలు తెలియదట.. షాకింగ్‌ నివేదిక..!

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) విడుదల చేసిన 2025 డయాబెటిస్ అట్లాస్‌ ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 58.9 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 25.2 కోట్ల మందికి తమకు డయాబెటిస్‌ ఉన్న విషయం తెలియదు. అంటే డయాబెటిస్‌ ఉన్నవారిలో దాదాపు 42.8 శాతం మంది గుర్తించబడకుండానే ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ లక్షణాల కోసం ఎదురుచూడకుండా

Healty Care: ప్రతి ఇద్దరిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని అస్సలు తెలియదట.. షాకింగ్‌ నివేదిక..!
Health Care

Updated on: Nov 14, 2026 | 1:54 PM

Healty Care: డయాబెటిస్‌.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే ఈ వ్యాధి విషయంలో అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న మరో విషయం ఉంది. చాలామందికి తమకు డయాబెటిస్‌ ఉందనే విషయం కూడా తెలియడం లేదు. ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతుండటంతో చాలామంది ఆలస్యంగా వ్యాధిని గుర్తిస్తున్నారు. ముఖ్యంగా టైప్‌-2 డయాబెటిస్‌ ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే సంవత్సరాల పాటు కొనసాగవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మందికి పైగా తెలియదు:

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) విడుదల చేసిన 2025 డయాబెటిస్ అట్లాస్‌ ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 58.9 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 25.2 కోట్ల మందికి తమకు డయాబెటిస్‌ ఉన్న విషయం తెలియదు. అంటే డయాబెటిస్‌ ఉన్నవారిలో దాదాపు 42.8 శాతం మంది గుర్తించబడకుండానే ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ లక్షణాల కోసం ఎదురుచూడకుండా అవసరమైనప్పుడు పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

డయాబెటిస్‌ ఉన్నట్లు తెలిపే హెచ్చరిక సంకేతాలు ఇవే

1. తరచూ దాహం వేయడం: రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినప్పుడు తరచూ దాహం వేయవచ్చు. నీళ్లు తాగిన కొద్దిసేపటికే మళ్లీ దాహం అనిపించడం ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు.

2. తరచూ మూత్ర విసర్జన: ముఖ్యంగా రాత్రి వేళల్లో పదేపదే మూత్రానికి వెళ్లాల్సి రావడం డయాబెటిస్‌లో కనిపించే సాధారణ లక్షణాల్లో ఒకటి.

3. ఎక్కువ ఆకలి వేయడం: తిన్నప్పటికీ మళ్లీ ఆకలి వేయడం, ఆహారం తీసుకున్న తర్వాత కూడా శక్తి లేనట్లు అనిపించడం వంటి సమస్యలు రావచ్చు.

4. కారణం లేకుండా బరువు తగ్గడం: ఆహారపు అలవాట్లలో మార్పులు లేకపోయినా బరువు తగ్గడం గమనిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

5. తరచూ అలసట: తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ నీరసంగా, అలసటగా అనిపించడం కూడా ఒక సూచన కావచ్చు.

6. చూపు మసకబారడం: రక్తంలో చక్కెర స్థాయుల్లో మార్పుల కారణంగా కంటిచూపు తాత్కాలికంగా మసకబారవచ్చు.

7. గాయాలు త్వరగా మానకపోవడం: చిన్న గాయాలు కూడా ఎక్కువ రోజులు మానకుండా ఉండటం, చర్మ ఇన్ఫెక్షన్లు పదేపదే రావడం వంటి సమస్యలు కనిపించవచ్చు.

8. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు: ముఖ్యంగా పాదాల్లో మంట, సూదులతో గుచ్చినట్లు అనిపించడం లేదా తిమ్మిర్లు రావడం నరాలపై ప్రభావం పడుతున్న సంకేతం కావచ్చు.

ఈ లక్షణాలన్నీ డయాబెటిస్‌ ఉన్నవారిలో తప్పనిసరిగా కనిపించవు. కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే రక్తంలో చక్కెర స్థాయులు పెరగవచ్చు.

డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ?

  • కుటుంబంలో తల్లిదండ్రులు లేదా సోదరులకు డయాబెటిస్‌ ఉంటే.
  • శారీరక శ్రమ తక్కువగా ఉండేవారికి.
  • అధిక బరువు లేదా పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి.
  • అధిక రక్తపోటు ఉన్నవారికి.
  • గతంలో గర్భధారణ సమయంలో డయాబెటిస్‌ వచ్చిన మహిళలకు.
  • PCOS సమస్య ఉన్న మహిళలకు. అయితే సన్నగా ఉన్నవారికి డయాబెటిస్‌ రాదని భావించడం పొరపాటు. శరీర బరువు సాధారణంగా ఉన్నప్పటికీ కొందరికి టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

డయాబెటిస్‌ను గుర్తించడానికి ఏ పరీక్షలు చేయించుకోవాలి?

డయాబెటిస్‌ను గుర్తించడానికి వైద్యులు సాధారణంగా మూడు రకాల పరీక్షలను సూచిస్తారు.

  • Fasting Blood Sugar: కనీసం 8 గంటలు ఆహారం తీసుకోకుండా ఉన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షిస్తారు.
  • HbA1c: గత రెండు నుంచి మూడు నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయులను అంచనా వేస్తుంది.
  • OGTT: గ్లూకోజ్‌ ద్రావణం తీసుకున్న తర్వాత శరీరం చక్కెరను ఎలా ప్రాసెస్‌ చేస్తుందో పరీక్షిస్తారు.
  • పరీక్షల ఫలితాలను వైద్యులు ఇతర ఆరోగ్య వివరాలతో కలిపి పరిశీలించి నిర్ధారణ చేస్తారు.

డయాబెటిస్‌ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా ఇతర శారీరక వ్యాయామం చేయాలి.
  • కూరగాయలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
  • చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తగ్గించాలి.
  • సరైన నిద్ర, ఒత్తిడి నియంత్రణపై దృష్టి పెట్టాలి.
  • కుటుంబంలో డయాబెటిస్‌ చరిత్ర ఉన్నవారు, ఇతర ప్రమాద కారకాలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.
  • ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది: డయాబెటిస్‌ లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకండి. ఎందుకంటే ఈ వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తిస్తే సరైన వైద్య సలహా, జీవనశైలి మార్పులతో దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

(నోట్‌- ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ హెల్త్‌ వెబ్‌ సైట్లు, నివేదికలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us