Healthy Life style: ఎక్కువ కాలం జీవించేందుకు ఇవి తప్పక పాటించాల్సిందే..!

|

Jun 04, 2022 | 3:38 PM

Healthy Life style: ఎక్కువ కాలం జీవించాలనేది చాలా మందికి ఉండే కోరిక. వయస్సు పైబడినా తమ పనులు తాము చేసుకుంటూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది అనుకుంటుంటారు.

Healthy Life style: ఎక్కువ కాలం జీవించేందుకు ఇవి తప్పక పాటించాల్సిందే..!
Long Life
Follow us on

Healthy Life style: ఎక్కువ కాలం జీవించాలనేది చాలా మందికి ఉండే కోరిక. వయస్సు పైబడినా తమ పనులు తాము చేసుకుంటూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది అనుకుంటుంటారు. ఈ రోజుల్లో ఉండే జీవనశైలి అలవాట్లతో ఇది సాధ్యమా అంటే అస్సలు కాదు. దీని కోసం ప్రతి ఒక్కరూ కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది. పని వేళలు, నిద్ర, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ఇలా అనేక విషయాల్లో మార్పులు అవసరమని అనేక పరిశోధనల్లో, అధ్యయనాల్లో తేలింది. ముందుగా మనుషులు ఎక్కువ కాలం జీవించాలంటే అందుకు అవసరమైనది సరైన నిద్ర, లిపిడ్ జీవక్రియ నియంత్రణ. ఈ రెండు ముఖ్య పాత్ర పోషిస్తాయని అనటంలో ఎలాంటి అనుమానం లేదు.

లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల ద్వారా మన రక్తంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. ఒకవేళ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్.. ఎక్కువ స్థాయిలో ఉన్నట్లయితే గుండె జబ్బులు కలిగే ప్రమాదం ఎక్కువవుతుంది. అంతేకాక.. మంచి నిద్రకూడా ఎక్కువ కాలం జీవించటానికి ఎంతో అవసరమని వైద్య నిపుణులు అధ్యయనాల్లో తేలింది. నిద్రకు ఇబ్బంది కలిగించే నికోటిన్, కెఫిన్, అల్కాహాల్ వంటి అలవాట్లను మానుకోవాలి. నిద్రకు ముందు ఎక్కువ ఆహారం తీసుకోకపోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నైట్ టైం లైట్ డైట్ ఉత్తమమని వారు అంటున్నారు.

ప్రశాంతమైన నిద్ర కోసం అనువైన వాతావరణంలో సేదతీరటం చాలా ముఖ్యం. ఈ సమయంలో మెుబైల్స్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు వీలైనంత దూరంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. పగటి పూట ఉపశమనంగా కేవలం అరగంట మాత్రమే నిద్రపోవాలని వారు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి పూట నిద్రకు దూరం కాకూడదని సూచిస్తున్నారు. రాత్రి పూట నిద్రకు దూరం కావటం వల్ల బాడీ క్లాక్ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. రోజూ వ్యాయామం, ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం వంటి వాటిని ఫాలో అవ్వాలని.. ఇలా శరీనాన్ని, మెదడును చక్కగా ఆరోగ్యకరమైన అలవాట్లతో చురుకుగా ఉంచుకుంటే ఎక్కువ కాలం జీవించేందుకు దోహదపడుతుందని వారు అంటున్నారు.