Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్నో ప్రయోజనాలు!

|

Aug 19, 2024 | 8:29 PM

తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి..

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్నో ప్రయోజనాలు!
Health Tips
Follow us on

తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎముకల ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు, నరాల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే తులసి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  1. తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులను ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
  2. కాలనుగుణంగా వ్యాధులను నయం చేయడానికి తులసిని మించింది ఏదీ లేదని నిపుణులు చెబుతుంటారు.
  3. వర్షాకాలంలో తులసి ఆకులను నమలడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
  4. తులసి ఆకులను నమలడం వల్ల అందులోని పోషకాల వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
  5. తులసి ఆకులను ఉదయాన్నే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.
  6. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
  7. ఈ ఆకులు రక్తపోటును తగ్గిస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
  8. తులసి ఆకులను తినడం వల్ల మనసులో ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆందోళన తగ్గుతుంది.
  9. ఈ తులసి ఆకులు దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
  10. తులసి ఆకుల రసం లేదా కషాయంతో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి