Health: ఇవి తింటే శృంగార సామర్థ్యం డబుల్ అవుతుంది.. స్పెర్మ్ కౌంట్ కూడా

|

Aug 26, 2024 | 11:08 AM

ఎన్నో.. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉలవలను మనం నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది. ఉలవలతో డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది.

Health: ఇవి తింటే శృంగార సామర్థ్యం డబుల్ అవుతుంది.. స్పెర్మ్ కౌంట్ కూడా
Horse Gram
Follow us on

ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోతే.. త్వరగా షెడ్డుకు వెళ్లాల్సి ఉంటుంది. చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. అందుకే ఫుడ్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు గింజ ధాన్యాలకు ఎక్కువమంది ప్రాముఖ్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఉలవల గురించి. ఉలవలు తింటే శృంగార శక్తి పెరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఉలవలను గుర్రాలకు ఎక్కువగా ఆహారంగా పెడతారని తెలిసిన విషయమే. ఇక ఉలవలుతో ఏపీలోని చాల ప్రాంతాల్లో చారు చేసుకుని తింటారు.

ఉలవలను తింటే… శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్లో  తెలుపు, నలుపు రెండు రకాలుగా ఉలవలు లభిస్తాయి. ఉలవలలో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్ బి, విటమిన్ బి 2, విటమిన్ బి6, ఫాస్ఫరస్, సి విటమిన్లు దండిగా ఉంటాయి. అంతేకాదు ఉలవల ద్వారా పొటీన్ల లభ్యత కూడా ఎక్కువే. ఉలవలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఉలవలలో ఉండే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె పనితీరు సక్రమంగా ఉండేలా చూస్తుంది. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా అరికడతుంది. అతిమూత్ర వ్యాధికి, మహిళలలో రుతుక్రమ సమస్యలకు ఉలవలు దివ్యౌషధం అనే చెప్పాలి. ఉలవలు తింటే చర్మ సౌంధర్యం కూడా బాగుంటుంది. ఇక లివర్ పనీతీరును కూాడా ఉలవలు మెరుగుపరుస్తాయి. కిడ్నీలో స్టోన్స్ సమస్యకు మంచి మెడిసిన్. ఎనిమియాను.. నివారించవచ్చు. ఉలవలు తింటే.. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని ఎన్నో పరిశోధనల్లో వెల్లడైంది. పురుషుల్లో శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది.

(ఇది ఫాలో అయ్యేముందు డైటీషియన్లు సంప్రదించండి)