Early Heart Attack Symptoms: గుండె పోటు రావడానికి నెల రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే.. బీకేర్‌ ఫుల్‌!

గుండె సంబంధిత వ్యాధుల వల్ల చిన్న వయసులోనే మరణించడం చాలా అరుదు. కానీ ఇటీవలి కాలంలో యువకులు, పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. దీనిని నివారించడానికి, మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే గుండెపోటు రావడానికి కొన్ని నెలల ముందు నుంచే మన శరీరంలో గుండెపోటు లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి..

Early Heart Attack Symptoms: గుండె పోటు రావడానికి నెల రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే.. బీకేర్‌ ఫుల్‌!
Early Heart Attack Symptoms

Updated on: Mar 05, 2025 | 9:23 PM

అనారోగ్యకరమైన జీవనశైలి, గతి తప్పిన ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. మన చుట్టూ ఉండేవారిలో గుండెపోటు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. గుండెపోట్లు సాధారణంగా వృద్ధులలో కనిపించాయి. గుండె సంబంధిత వ్యాధుల వల్ల చిన్న వయసులోనే మరణించడం చాలా అరుదు. కానీ ఇటీవలి కాలంలో యువకులు, పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. దీనిని నివారించడానికి, మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే గుండెపోటు రావడానికి కొన్ని నెలల ముందు నుంచే మన శరీరంలో గుండెపోటు లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి. వాటిని సకాలంలో గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. కాబట్టి నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుండెపోటుకు 30 రోజుల ముందు మీ శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు ఇవే..

ఛాతీ, భుజం, దవడలో నొప్పి

గుండెపోటు రావడానికి ముందు ఛాతీ నొప్పి రావచ్చు. ఛాతీ చుట్టూ ఒత్తిడి, బరువుగా అనిపిస్తుంది. కొంతమందికి చేతులు, భుజాలు, దవడలలో కూడా నొప్పి ఉండవచ్చు. ఛాతీ, భుజాలు, దవడలో నొప్పి ఉంటే ఈ సంకేతాలను విస్మరించకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.

అలసట- బలహీనత

గుండెపోటు రాకముందు శరీరం అలసిపోతుంది. ఎటువంటి కఠినమైన చేయకపోయినా, శరీరం త్వరగా అలసిపోయినట్లు అలసటగా అనిపించవచ్చు. ఇలా పదే పదే జరిగితే, దానిని విస్మరించకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

తలతిరగడం – మూర్ఛలు

గుండెపోటు రావడానికి 30 రోజుల ముందు పదే పదే తలతిరుగుతూ ఉండటం, కొన్నిసార్లు మూర్ఛపోవడం వంటి లక్షణాలు బయటపడతాయి. ఈ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, రక్త ప్రవాహం తగ్గడం వంటివి సంభవిస్తాయి. అటువంటి పరిస్థితిలో వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

గుండెపోటు రాకముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీని వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. చిన్న పనులు చేసిన తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు సూచించిన మందులను తప్పకుండా వాడాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించాలి.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. అర్హత కలిగిన వైద్య సలహాకు ఇది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us