
తలనొప్పి సర్వసాధారణం. కొన్నిసార్లు నొప్పి తల ముందు భాగం మధ్యలో, కొన్నిసార్లు మొత్తం తలలో, ఇంకొన్ని సందర్భాల్లో తల వెనుక భాగంలో ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ తలనొప్పి సాధారణంగా మైగ్రేన్, నిద్ర లేకపోవడం, పాత గాయాలు, మానసిక ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల వస్తుంది. కానీ ఇలా రకరకాలుగా కాకుండా ఎల్లప్పుడూ తల వెనుక భాగంలో సంభవిస్తే అది అధిక రక్తపోటు ( హై బిపి) కారణం కావచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి అధిక రక్తపోటు, తలనొప్పి మధ్య సంబంధం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది? దానిని ఎలా గుర్తించాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగం డాక్టర్ అజిత్ జైన్ దీని గురించి మాట్లాడుతూ.. ఎవరికైనా ఒకటి లేదా రెండుసార్లు అధిక రక్తపోటు సమస్య తలెత్తితే అది తల వెనుక భాగంలో నొప్పిని కలిగించదు. కానీ రక్తపోటు 180/120 mmHg కంటే ఎక్కువగా పెరిగితే ఖచ్చితంగా తలనొప్పికి కారణమవుతుంది. ఈ పరిస్థితిని వైద్య అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి. కొన్ని సందర్భాల్లో రక్తపోటులో స్వల్ప పెరుగుదల కూడా తల వెనుక భాగంలో నొప్పిని కలిగిస్తుంది.
సాధారణంగా రక్తపోటు పెరిగినప్పుడు.. అది మెదడులోని రక్త నాళాలపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల తలనొప్పి వస్తుంది. చాలా సందర్భాలలో తల వెనుక భాగంలో తరచుగా నొప్పి వస్తుంది. కానీ చాలా సందర్భాలలో తల నొప్పి ఉండకపోవచ్చు. అధిక రక్తపోటు లక్షణాలను సులభంగా గుర్తించడంలో విఫలం చెందడం వల్ల సమస్య తీవ్రతరం అవుతుంది. కానీ ఇలా విస్మరిండం అంత మంచిది కాదు. తల వెనుక భాగంలో నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చయండి.