Covid-19 Effect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేక అనారోగ్య సమస్యలు.. తాజా పరిశోధనలో వెల్లడి

|

Jan 27, 2021 | 10:42 PM

Covid-19 Effect: కోవిడ్‌ సోకిన వారు కోలుకున్న తర్వాత ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒకసారి కరోనా సోకిన తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

Covid-19 Effect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేక అనారోగ్య సమస్యలు.. తాజా పరిశోధనలో వెల్లడి
Follow us on

Covid-19 Effect: కోవిడ్‌ సోకిన వారు కోలుకున్న తర్వాత ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒకసారి కరోనా సోకిన తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్నో పరిశోధనలు చేసిన పరిశోధకులు పలు విషయాలను వెల్లడించారు. కరోనా సోకిన ఎనిమిది మందిలో ఒకరు వైరస్‌ సోకిన ఆరు నెలల్లోనే అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని కొత్త అధ్యయనంలో గుర్తించారు. వారిలో అధికంగా మొదట మానసిక, లేదా నాడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు.

కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో చాలా వరకు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీని కారణంగా మెదడులోకి అనేక మానసిక రుగ్మతలకు దారి తీస్తుందని కనుగొన్నారు.

కాగా, కరోనా సోకిన తొమ్మిది మందిలో ఒకరికి డిప్రెషన్‌ లేదా స్ట్రోక్‌ వంటి సమస్యలు ఎదువుతున్నాయని తేలింది. అమెరికాకు చెందిన 236,379 మంది కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారిపై పరిశోధకులు ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డులను ఉపయోగించారు. వీరి డేటాను ఇన్ఫ్లుఎంజా బాధిత గ్రూపుతో పోల్చి చూశారు. కరోనా నుంచి కోలుకున్న ఆరు నెలల్లో నాడీ లేదా మానసిక సమస్యలు 33.6 శాతంగా ఉన్నట్లు పరిశధకులు గుర్తించారు.

దాదాపు 13 శాతం మందిలో మొదటగా వీటిని గుర్తించారు. కరోనా సో కిన ఐదుగురిలో ఒకరు మూడు నెలల్లోనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని గుర్తించారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌, మెదడు లోపల తీవ్ర రక్తస్రావం, మతిమరుపు, మానసిక సమస్యలతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కంటే కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత చాలా మందిలో ఈ అనారోగ్య సమస్యలు సర్వసాధారణమని తెలిపారు.

Also Read: COVID VACCINE: కరోనా వ్యాక్సిన్ విషయంలో డబ్లూహెచ్‌వో సంచలన నిర్ణయం.. వారికి ప్రాధాన్యత అవసరం లేదని ప్రకటన..