ఈ నూనె కొవ్వును ఐస్‌లా కరిగిస్తుంది.. గుండెపోటు అన్న భయమే ఉండదు

భారతదేశంలో చాలా మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్‌కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ ఫుడ్ తినే ధోరణి చాలా ఎక్కువ. మన ఇళ్లలో, బయట ఫుడ్ మార్కెట్లలో ఉపయోగించే చాలా రకాల వంట నూనె రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరడానికి దారితీస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్.. మధుమేహం, గుండెపోటుకు దారి తీస్తుంది.

ఈ నూనె కొవ్వును ఐస్‌లా కరిగిస్తుంది.. గుండెపోటు అన్న భయమే ఉండదు
Flaxseed Oil
Follow us

|

Updated on: Jul 22, 2024 | 1:53 PM

భారతదేశంలో చాలా మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్‌కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ ఫుడ్ తినే ధోరణి చాలా ఎక్కువ. మన ఇళ్లలో, బయట ఫుడ్ మార్కెట్లలో ఉపయోగించే చాలా రకాల వంట నూనె రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరడానికి దారితీస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్.. మధుమేహం, గుండెపోటుకు దారి తీస్తుంది. దీన్ని నివారించడానికి సరైన నూనెను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి మనం అవసరమైన దానికంటే ఎక్కువ నూనెను వాడినప్పుడు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది తీవ్రమైన వ్యాధుల ప్రభావాన్ని పెంచుతుంది. అందుకే.. మన శరీరానికి ఆరోగ్యానికి ఏ నూనె మంచిదో ఇప్పుడు తెలుసుకోండి..

చెడు కొలెస్ట్రాల్ వల్ల శరీరానికి ప్రమాదం

నూనె ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు, అది రక్తంలోని ఇతర పదార్ధాలతో మిళితం అవుతుంది.. దీంతో ధమనులకు అంటుకునే ఫలకం ఏర్పడటం ప్రారంభమవుతుంది. మన ధమనులలో చాలా చెడ్డ కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు, రక్త నాళాలు అడ్డుకోవడం ప్రారంభమవుతుంది. దీంతో గుండెకు రక్తాన్ని అందించడం కష్టమవుతుంది. రక్తప్రసరణలో ఒత్తిడి ఏర్పడినప్పుడు అధిక రక్తపోటుకు గురికావడం సహజమే.. ఇది గుండెపోటు సహా.. అనేక రకాల తీవ్ర వ్యాధులకు కారణమవుతుంది..

మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ఈ నూనెను తీసుకోండి..

వాస్తవానికి మార్కెట్‌లలో లభించే వంటనూనెలో దాని నాణ్యత ప్రమాణాలను చూసి తీసుకోవాలి.. పోషకాహార నిపుణుల ప్రకారం.. అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారికి అవిసె గింజల నూనె మంచిది. దీన్ని సలాడ్‌తో కూడా తినవచ్చు. దీన్ని కొద్దిగా వేడి చేసి కూడా తాగవచ్చు..

వాస్తవానికి అవిసె గింజల నుంచి లిన్సీడ్ నూనె తీస్తారు.. ఇది కొవ్వు ఆమ్లాల గొప్ప మూలం. ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనె చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

అందువల్ల, ఇతర వంట నూనెల కంటే అవిసె గింజలతో తయారు చేసిన నూనెను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే..)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..