Health: మలంలో రక్తం పడుతుంటే పైల్స్ అనుకుంటున్నారా..? ఈ ప్రమాదకర వ్యాధి కూడా కావొచ్చు

|

Apr 03, 2024 | 6:56 PM

మీకు ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయో వాటిన్నంటిన్ని ఒక పేపర్‌పై రాసుకోవాలి. దీని వల్ల చెకప్ సమయంలో డాక్టర్లకు ఈజీ అవుతుంది. మలంలో రక్తం ఎలా పడుతుంది వంటి వివరాలను డాక్టర్‌కు పూర్తిగా తెలియజేయాలి. పైల్స్ ఉన్నప్పుడు కూడా మోషన్‌కి వెళ్లేటప్పుడు ముదురు ఎరుపు రంగులో రక్తం పడుతూ ఉంటుంది. కానీ...

Health: మలంలో రక్తం పడుతుంటే పైల్స్ అనుకుంటున్నారా..? ఈ ప్రమాదకర వ్యాధి కూడా కావొచ్చు
Colon Cancer Symptoms
Follow us on

ఒక్కసారిగా  బరువు కోల్పోతున్నారా..? ఆర్శమొలలు వంటివి లేకుండానే..  మీ మలంలో రక్తం పడుతుందా..? పొట్ట కింద భాగంలో నొప్పిగా ఉంటుందా..? మీ పొట్ట నిండుగా, ఉబ్బరంగా అనిపిస్తుందా..? ఎక్కువ సార్లు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుందా..? అదే పనిగా అలసటగా ఉంటుందా..? ఈ లక్షణాలు 3 లేదా అంతకంటే ఎక్కువ వారాలు ఉంటే.. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ లక్షణాలు పెద్ద పేగు క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు.  క్యాన్సర్లను ప్రాథమిక దశలో గుర్తిస్తే.. ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు.

మీరు మలం ఎలా వస్తుందో చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది. దీని గురించి డాక్టర్ వద్ద మాట్లాడేందుకు అస్సలు వెనకాడకండి. పైల్స్ ఉన్నప్పుడు మాత్రమే కాదు.. పెద్ద పేగు క్యాన్సర్‌ ఉన్నప్పుడు కూడా ముదురు ఎరుపు రంగు లేదా నల్లటి రక్తం పడుతూ ఉంటుంది. అదే విధంగా వారాల తరబడి ఎక్కవసార్లు  మోషన్‌కి వెళ్తుంటే కూడా అప్రమత్తమవ్వాలి. వయసు పైబడుతున్న సమయంలో.. పేగు క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువ. అధికంగా రెడ్ మీట్ తినేవారికి ఈ వ్యాధి వచ్చే ముప్పు ఉంది.

డాక్టర్లు పలు పరిశోధనల తర్వాత తెలిపిన విషయం ఏంటంటే… చాలావరుకు వంశపారపర్యంగా పెద్ద పేగు క్యాన్సర్..  రావడం లేదు. అయితే మీ దగ్గరి రిలేటివ్స్‌లో ఎవరైనా..  50 ఏళ్ల లోపున ఈ క్యాన్సర్‌కు గురైతే ఆ విషయం డాక్టర్‌కి చెబితే మంచిది. డైలీ వ్యాయామం చేయడం.. ఎక్కువ ఫైబర్ ఫుడ్ తినడం, వాటర్ ఎక్కువగా తాగడం వల్ల.. పేగు క్యానర్ల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ క్యాన్సర్ స్టేజ్ 3 కి చేరితే.. లింఫ్ నోడ్స్‌ వంటి కణజాలలకు ఈ క్యాన్సర్ సెల్స్ వ్యాప్తి చెందుతాయి. అందుకే ఏవైనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు.

(NOTE: వీటిలో ఏ లక్షణాలు ఉన్నా.. డాక్టర్‌ను సంప్రదించండి)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..