హాలీడే ప్లాన్ చేస్తున్నారా? ఈ బీచ్‌లలో వైరస్‌ ముప్పు! ఆరోగ్య శాఖ అత్యవసర హెచ్చరిక

సీషెల్స్‌కు వెళ్లే పర్యాటకులు జాగ్రత్త! అందమైన ఈ దీవిలో చికున్‌గున్యా వ్యాప్తి వేగంగా ఉంది. US CDC ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. దోమ కాటు వల్ల వచ్చే ఈ వ్యాధి జ్వరం, కీళ్ల నొప్పులు కలిగిస్తుంది. దోమల వికర్షకం, పూర్తి దుస్తులు ధరించడం, స్క్రీన్ ఉన్న రూమ్స్ ఎంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.

హాలీడే ప్లాన్ చేస్తున్నారా? ఈ బీచ్‌లలో వైరస్‌ ముప్పు! ఆరోగ్య శాఖ అత్యవసర హెచ్చరిక
Cdc Travel Advisory

Updated on: Feb 13, 2026 | 4:37 PM

హిందూ మహాసముద్రంలోని అందమైన ద్వీప దేశమైన సీషెల్స్‌కు మీరు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే, జాగ్రత్తగా ఉండండి. సీషెల్స్ దీవులకు ప్రయాణించే ప్రజలకు US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ (CDC) హెచ్చరిక జారీ చేసింది. సీషెల్స్ అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. కానీ, ఈ నెలలో అక్కడ చికున్‌గున్యా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. దోమ కాటు వల్ల చికున్‌గున్యా వస్తుంది. దీని వల్ల జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, దద్దుర్లు, తీవ్ర అలసటకు కారణమవుతుంది. ఈ లక్షణాలు సాధారణంగా దోమ కాటు తర్వాత మూడు నుండి ఏడు రోజుల తర్వాత కనిపిస్తాయి. అయితే, చికున్‌గున్యా వల్ల మరణించే ప్రమాదం చాలా తక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు.

చికున్‌గున్యాను నివారించడానికి ముందుగా దోమల వికర్షకం వేసుకుని, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదనంగా, ఎయిర్ కండిషనింగ్ ఉన్న లేదా దోమలు ప్రవేశించకుండా నిరోధించడానికి స్క్రీన్లు ఉన్న కిటికీలు, తలుపులు ఉన్న రూమ్స్‌, హోటల్స్‌ని ఎంచుకోండి. చికున్‌గున్యాను నివారించడానికి టీకాలు వేయించుకోండి.

ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది?: 

తల్లి నుండి బిడ్డకు ఈ ఇన్ఫెక్షన్ సంక్రమించే ప్రమాదం ఉన్నందున అలాంటి ప్రదేశాలకు ప్రయాణం చేయవద్దని CDC సూచిస్తోంది. 65 ఏళ్లు పైబడిన వారు లేదా మధుమేహం లేదా గుండె జబ్బులు ఉన్నవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణంలో లేదా ప్రయాణం తర్వాత మీకు జ్వరం లేదా కీళ్ల నొప్పులు ఎదురైతే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

సీషెల్స్: అందాలు, ద్వీప సముదాయం. సీషెల్స్ హిందూ మహాసముద్రంలో దాదాపు 115 చిన్న దీవులతో కూడిన అందమైన దేశం. తూర్పు ఆఫ్రికాకు సమీపంలో ఉన్న ఈ దేశం తెల్లటి ఇసుక బీచ్‌లు, ఆకాశనీలం జలాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అల్డబ్రా తాబేళ్లు, నల్ల చిలుకలు వంటి ప్రత్యేకమైన జీవులు ఇక్కడ కనిపిస్తాయి. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. దానిలోని కొన్ని ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడా గుర్తించబడ్డాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..