Tiffin Vs White Rice: ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ బదులుగా వైట్‌రైస్ తింటున్నారా.? ఇది తప్పక తెలుసుకోండి.!

|

May 14, 2024 | 12:24 PM

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్న లేచిన మొదలు.. నైట్ నిద్రపోయేవరకు ఎవరు ఏమి చేస్తున్నారో..? ఏ టైంకి ఏది తింటున్నారో.? ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. సాధారణంగా అందరూ మార్నింగ్ 10 గంటలలోపు టిఫిన్ తింటుంటే.. ఈకాలం యువత దాదాపుగా 11 గంటలకు తమ బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తి చేస్తున్నారు. సరే ఇదంతా..

Tiffin Vs White Rice: ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ బదులుగా వైట్‌రైస్ తింటున్నారా.? ఇది తప్పక తెలుసుకోండి.!
Eating Rice
Follow us on

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్న లేచిన మొదలు.. నైట్ నిద్రపోయేవరకు ఎవరు ఏమి చేస్తున్నారో..? ఏ టైంకి ఏది తింటున్నారో.? ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. సాధారణంగా అందరూ మార్నింగ్ 10 గంటలలోపు టిఫిన్ తింటుంటే.. ఈకాలం యువత దాదాపుగా 11 గంటలకు తమ బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తి చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనపెట్టండి.. ఇప్పుడంటే టిఫిన్స్ అవి ఉన్నాయ్ గానీ.. కొన్ని సంవత్సరాల క్రితం మన పూర్వీకులు టిఫిన్ చేయకుండా ఉదయాన్నే వైట్ రైస్ తిని కూలీ పనులకు వెళ్తుండేవారట. ఆ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇన్‌ఫ్యాక్ట్ మన కంటే.. వారి శారీరిక బలమే ఎక్కువ అని చెప్పొచ్చు.

అయితే ఇప్పటి జనరేషన్ టిఫిన్ బదులుగా అన్నం తింటే.. అధిక బరువు పెరుగుతారని.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. మరి ఇంతకీ ఉదయాన్నే అన్నం తినడం మంచిదా.? కాదా.? ఉదయాన్నే అన్నం తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కానీ వైట్ రైస్ మోతాదు తక్కువ ఉండేలా చూసుకోవాలి. మనం పొద్దునే లేచిన వెంటనే శరీరానికి చురుకుదనం కావాలి. అలాగే శక్తి కూడా చాలా అవసరం. ఈ సమయంలో బరువును కంట్రోల్ చేసుకోవాలనుకునే వారు.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట అన్నం తింటే.. రక్తంలోని చక్కెర స్థాయి కంట్రోల్‌లో ఉంటుంది. అయితే ఆ మార్నింగ్ సమయంలో అన్నం మోతాదు కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఉదయం పూట అన్నం మోతాదు ఎక్కువగా ఉంటే.. లేనిపోని సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఆహార పదార్ధం ఏదైనా.. తక్కువ మోతాదులో తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. ఏ ఆహారమైనా.. మోతాదుకు మించి తింటే.. లేనిపోనీ ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కాగా, మీరు ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు కచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించండి.. పై వార్త కేవలం పలు అధ్యయనాలు ఆధారంగా ప్రచురితం చేసింది మాత్రమే.