Anti Aging Fruits: ఈ పండ్లను తినండి.. నిత్యం నవయవ్వనంగా ఉండండి..!

|

Jun 30, 2022 | 3:33 PM

Anti Aging Fruits: వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, రేఖలు రావడం మొదలవుతాయి. ఎక్కువ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం..

Anti Aging Fruits: ఈ పండ్లను తినండి.. నిత్యం నవయవ్వనంగా ఉండండి..!
Anti Aging
Follow us on

Anti Aging Fruits: వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, రేఖలు రావడం మొదలవుతాయి. ఎక్కువ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతోంది. ఇలాంటి సమస్య నుంచి బయట పడేందుకు, చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అవకాడో:
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది పొడి చర్మం సమస్యను దూరం చేస్తుంది. ఇందులో విటమిన్లు సి, ఎ, బి, ఇ, కె, పొటాషియం ఉన్నాయి. ఇది మృతకణాలను తొలగిస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై ముడతలు రాకుండా కాపాడుతుంది.

బ్లూబెర్రీ:
బ్లూబెర్రీ చాలా రుచికరమైన ఫలం. ఇందులో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇది చర్మం వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో దోహదపడుతుంది. ఇందులో విటమిన్ సి, ఎ కూడా ఉన్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. యవ్వనాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

బొప్పాయి:
బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. దీన్ని అల్పాహారంలో తీసుకోవచ్చు. ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది ముడతలు, గీతలను తొలగించడానికి సహాయపడుతుంది.

దానిమ్మ:
దానిమ్మలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అలాగే ప్యూనికాలాజిన్స్ అనే మూలకం ఉంటుంది. ఇది కొల్లాజెన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ముఖంపై వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. దానిమ్మ పండును జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.