ఎప్పుడూ నీరసంగా ఉంటున్నారా.? అయితే ఈ ఫుడ్స్ మీ డైట్‌లో చేర్చండి.. అవేంటంటే.!

| Edited By: Ravi Kiran

Apr 03, 2024 | 12:13 PM

తిన్నా, తినకపోయినా నీరసంగా ఉండేవారిని మనం చూస్తూనే ఉంటాం. ప్రతి రోజు నీరసంగా ఉంటూ.. ఎప్పుడు చూసినా యాక్టివ్‌గా లేకుండా, డల్‌గా కనిపిస్తున్నవారి సంఖ్య మనం ఉన్న సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. తిన్నా.. తినకపోయినా ఎందుకు నీరసంగా ఉంటుంది.? నీరసం తగ్గాలంటే ఏం చెయ్యాలి.?

ఎప్పుడూ నీరసంగా ఉంటున్నారా.? అయితే ఈ ఫుడ్స్ మీ డైట్‌లో చేర్చండి.. అవేంటంటే.!
Immunity Foods
Follow us on

తిన్నా, తినకపోయినా నీరసంగా ఉండేవారిని మనం చూస్తూనే ఉంటాం. ప్రతి రోజు నీరసంగా ఉంటూ.. ఎప్పుడు చూసినా యాక్టివ్‌గా లేకుండా, డల్‌గా కనిపిస్తున్నవారి సంఖ్య మనం ఉన్న సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. తిన్నా.. తినకపోయినా ఎందుకు నీరసంగా ఉంటుంది.? నీరసం తగ్గాలంటే ఏం చెయ్యాలి.?

చాలామంది మార్నింగ్ నుంచి నైట్ వరకు నీరసంగానే ఉంటారు. కొంతమంది అయితే నిద్ర లేచిన తర్వాత కూడా బాగా అలసటగా ఫీలవుతూ ఉంటారు. ఇలా నీరసంగా ఉండటం వల్ల ఏ వర్క్ కూడా సరిగ్గా చేయలేరు. ఇంటి పనులు, ఒంటి పనులే కాకుండా.. ఆఫీస్ వర్క్, బిజినెస్ చేసేవారు నీరసంగా ఉండడం వల్ల వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా.. నీరసంగా ఉంది అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు.

సరైన ఫుడ్, మంచి నిద్ర, రెగ్యులర్ లైఫ్ గాడి తప్పడం లాంటివారిలో ఈ నీరసం, అలసట ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివారు శక్తినిచ్చే మంచి ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. దాని కోసం అరటి పండ్లు, బ్రౌన్ రైస్, ఫిష్, గుడ్డు లాంటివాటిని మన డైట్‌లో యాడ్ చేయాలని చెప్తున్నారు. దీంతో పాటు రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలని కూడా సూచిస్తున్నారు.

వీటన్నింటితో పాటు మంచి మ్యూజిక్ వినాలని.. దాని వల్ల బాడీ చలాకీగా మారుతుందని.. అందుకోసం ప్రతీరోజు కొద్దిసేపు నచ్చిన మ్యూజిక్ వింటూ చిల్ అవ్వాలని అంటున్నారు నిపుణులు. దీంతో పాటు ప్రతిరోజు చల్లటి నీటితో స్నానం చేయాలని సూచనలు చేస్తున్నారు. చల్లటి నీటి వల్ల కండరాలు బలపడతాయి అని.. మెటబాలిజంను పెంచుతుంది అని అంటున్నారు. వీటితో పాటు ప్రతి రోజూ నవ్వడం కూడా అలవాటు చేసుకోవాలనంటున్నారు. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అని.. నిస్సత్తువ దూరం అవుతుందన్నారు. దీని కోసం ఫ్రెండ్స్‌తో, పిల్లలతో గడపడం లాంటివి చేయాలని చెప్తున్నారు. దీంతో పాటు ఎక్కువగా వాటర్ తీసుకోవడం మర్చిపోవద్దని అంటున్నారు. తప్పనిసరిగా 8 గంటల నిద్ర కూడా అవసరం అని అంటున్నారు.