సీరం ఇన్స్ టిట్యూట్ అగ్నిప్రమాద ఘటన, సజీవదహనమైన ఐదుగురి మృతదేహాల వెలికితీత, విచారణకు ప్రభుత్వ ఆదేశం

అగ్నిప్రమాదానికి గురైన సీరం కంపెనీ ఆరో అంతస్థు నుంచి పూర్తిగా కాలిపోయిన ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్టు మేయర్ తెలిపారు.

సీరం ఇన్స్ టిట్యూట్ అగ్నిప్రమాద ఘటన, సజీవదహనమైన ఐదుగురి మృతదేహాల వెలికితీత, విచారణకు ప్రభుత్వ ఆదేశం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 21, 2021 | 8:05 PM

అగ్నిప్రమాదానికి గురైన సీరం కంపెనీ ఆరో అంతస్థు నుంచి పూర్తిగా కాలిపోయిన ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్టు మేయర్ తెలిపారు. ఈ ఫ్లోర్ లో వీటిని కనుగొన్నామన్నారు. వీరిని గుర్తించేందుకు యత్నిస్తున్నట్టు  చెప్పారు. బీసీజీ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేసే ఫ్లోర్ లో ప్రమాదం సంభవించిందని, అయితే కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి అంతరాయం కలగలేదన్నారు, ఈ బిల్డింగ్ నుంచి 8 మందిని ఖాళీ చేయించారన్నారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. బిల్డింగ్ 4,5,6 ఫ్లోర్లలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇందుకు కారణం ఇంకా తెలియలేదు.  దీనిపై ఇంకా ఆరా తీస్తున్నారు. 15 కి పైగా వాటర్ ట్యాంకర్లు మంటలను ఆర్పివేసినట్టు తెలిసింది. ఈ దారుణ ఘటనపట్ల సీఈఓ ఆదార్ పూనావాలా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.