FEATURED:

బయటి సౌండ్స్‌కి చెక్.. boAt తీసుకొచ్చిన అదిరిపోయే ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్ ఇవే..

ప్రయాణాల్లో బయటి ట్రాఫిక్ గొడవ లేకుండా ప్రశాంతంగా పాటలు వినాలనుకుంటున్నారా? లేక ఆఫీస్ కాల్స్‌లో మీ వాయిస్ క్రిస్టల్ క్లియర్‌గా వినిపించే బెస్ట్ ఆడియో డివైజ్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే boAt సరికొత్త నిర్వాణ సిరీస్‌ను రంగంలోకి దించింది. ఏకంగా 80 గంటల బ్యాటరీ లైఫ్, అడ్వాన్స్‌డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వచ్చిన Nirvana Zenith Pro ఇయర్‌బడ్స్, Nirvana Eutopia 2 ANC హెడ్‌ఫోన్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బయటి సౌండ్స్‌కి చెక్.. boAt తీసుకొచ్చిన అదిరిపోయే ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్ ఇవే..
Boat Nirvana Zenith Pro And Eutopia 2 Anc Review

Updated on: Sep 17, 2026 | 3:07 PM

ప్రయాణాల్లో బయటి ట్రాఫిక్ సౌండ్స్ వినపడకుండా ఉండాలన్నా.. ఆఫీస్ పనుల్లో, వర్చువల్ మీటింగ్స్‌లో క్లియర్ కాలింగ్ కావాలన్నా నేడు నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్ తప్పనిసరిగా మారాయి. ఎక్కువ బ్యాటరీ లైఫ్, మల్టీపాయింట్ కనెక్టివిటీ, కంఫర్ట్, ప్రీమియం ఆడియో కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt తమ నిర్వాణ సిరీస్‌లో Nirvana Zenith Pro , Nirvana Eutopia 2 ANC మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ల ప్రాధాన్యతలకు తగినట్లుగా ఈ రెండు మోడల్స్ ఎలాంటి ఫీచర్లు అందిస్తున్నాయి? కొనుగోలు చేసేటప్పుడు వేటిని గమనించాలో తెలుసుకోవడం ముఖ్యం.

boAt Nirvana Zenith Pro

ఎక్కువ సమయం ప్రయాణించే వారు, నాణ్యమైన సౌండ్ కోరుకునే మ్యూజిక్ లవర్స్ కోసం boAt నిర్వాణ జెనిత్ ప్రో ఇయర్‌బడ్స్‌ను రూపొందించారు.

50 dB హైబ్రిడ్ అడాప్టివ్ ANC: చుట్టూ ఉన్న శబ్దాన్ని విశ్లేషించి దానంతట అదే నాయిస్ క్యాన్సిలేషన్ స్థాయిని సర్దుబాటు చేస్తుంది.

హై-రెస్ ఆడియో – LDAC: 12mm డ్రైవర్లు, LDAC కోడెక్ సపోర్ట్, స్పేషియల్ ఆడియోతో అత్యుత్తమ శ్రవణ అనుభవాన్ని ఇస్తుంది.

అడాప్టివ్ EQ (by Mimi): వినియోగదారుడి వినికిడి సామర్థ్యానికి అనుగుణంగా ఆడియోను వ్యక్తిగతీకరించుకోవచ్చు .

AI-ENxతో 6 మైక్రోఫోన్లు: వర్చువల్ మీటింగ్స్, ఫోన్ కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ పూర్తిగా తొలగించి స్పష్టమైన వాయిస్‌ను అందిస్తుంది.

80 గంటల ప్లేటైమ్: కేవలం 10 నిమిషాల ASAP ఛార్జ్‌తో ఏకంగా 250 నిమిషాల ప్లేబ్యాక్ పొందవచ్చు.

boAt Nirvana Eutopia 2 ANC:

ఇయర్‌బడ్స్ కంటే ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ సౌకర్యవంతంగా ఉంటాయని భావించే వారి కోసం నిర్వాణ యుటోపియా 2 ANC సరైన ఎంపిక.

45 dB అడాప్టివ్ హైబ్రిడ్ ANC: boAt Hearables యాప్ ద్వారా నాయిస్ క్యాన్సిలేషన్ స్థాయిలను సులభంగా సెట్ చేసుకోవచ్చు.

డ్యూయల్ డ్రైవర్లు – 3D స్పేషియల్ ఆడియో: హై-రెస్ ఆడియో, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో సినిమాలు, కంటెంట్ వీక్షణకు విస్తృత సౌండ్ స్టేజ్ లభిస్తుంది.

మెరుపు వేగంతో ఛార్జింగ్: 80 గంటల భారీ ప్లేబ్యాక్ టైమ్‌తో పాటు.. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 12 గంటల వరకు పనిచేయడం దీని ప్రత్యేకత.

కాలింగ్ సపోర్ట్: AI-ENx టెక్నాలజీ రద్దీ ప్రదేశాల్లో సైతం క్లియర్ కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ANC డివైజ్ ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన అంశాలు

నాయిస్ క్యాన్సిలేషన్ – ఫిట్: ఇయర్‌బడ్స్ చెవుల్లో సరిగ్గా కూర్చున్నప్పుడే (Proper Fit) ANC సమర్థవంతంగా పనిచేస్తుంది.

బ్యాటరీ లైఫ్: ప్రయాణాలు, రోజంతా ఆఫీస్ అవసరాలకు తగినంత బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందో లేదో చూడాలి.

కాలింగ్ – మల్టీపాయింట్ కనెక్టివిటీ: తరచూ ల్యాప్‌టాప్, మొబైల్ మధ్య మారే వారికి ‘మల్టీపాయింట్ స్విచింగ్, ఎక్కువ మైక్రోఫోన్లు ఉండటం ఉపకరిస్తుంది.

ఆడియో టెక్నాలజీ: మ్యూజిక్ ప్రియులు LDAC, హై-రెస్ ఆడియో, స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.

కంఫర్ట్: ఎక్కువ సమయం ధరించినా చెవులు నెప్పి రాకుండా లైట్‌వెయిట్ డిజైన్‌ను ఎంచుకోవడం మంచిది.

ఏది బెస్ట్..?

మీరు కాంపాక్ట్ సైజులో పర్సనలైజ్డ్ ఆడియోతో కూడిన బడ్స్ కోరుకుంటే Nirvana Zenith Pro బెస్ట్ ఛాయిస్. అలాగే రోజంతా సౌకర్యవంతంగా ఉంటూ భారీ బ్యాటరీ బ్యాకప్, ఓవర్-ఇయర్ కంఫర్ట్ కావాలనుకుంటే Nirvana Eutopia 2 ANC సరైన డివైజ్. మీ వినియోగాన్ని బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.