దిల్ రాజును బన్నీ ఒప్పిస్తాడా..!

| Edited By:

Jan 01, 2020 | 9:13 PM

సంక్రాంతి పోరు ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మెడకు చుట్టుకుంది. ఈ పండుగ బరిలో దిగబోతున్న మూడు చిత్రాలతోనూ దిల్ రాజుకు సంబంధం ఉంది. ఇందులో మహేష్ నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరుకు దిల్ రాజు ఒక నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఈ మూవీని నైజాంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీతో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, రజనీకాంత్ దర్బార్ చిత్రాలను.. నైజాం ఏరియాలో ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సరిలేరు […]

దిల్ రాజును బన్నీ ఒప్పిస్తాడా..!
Follow us on

సంక్రాంతి పోరు ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మెడకు చుట్టుకుంది. ఈ పండుగ బరిలో దిగబోతున్న మూడు చిత్రాలతోనూ దిల్ రాజుకు సంబంధం ఉంది. ఇందులో మహేష్ నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరుకు దిల్ రాజు ఒక నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఈ మూవీని నైజాంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీతో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, రజనీకాంత్ దర్బార్ చిత్రాలను.. నైజాం ఏరియాలో ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరుకే ఆయన ఎక్కువ థియేటర్లను ఫిక్స్ చేసుకున్నాడట.

అయితే అల వైకుంఠపురములోకు వచ్చిన క్రేజ్ నేపథ్యంలో ఈ మూవీని రెండు రోజుల ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బన్నీ టీమ్ భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ విషయంపై దిల్ రాజుతో వారు సంప్రదింపులు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజు ప్రస్తుతం ఫారిన్‌లో ఉన్నారు. ఆయన రాగానే బన్నీ, అతడి టీమ్ వెళ్లి.. రిలీజ్ డేట్‌పై సంప్రదింపులు జరపనున్నట్లు ఫిలింనగర్‌ టాక్.  ఈ విషయంలో ఆయనను ఎలాగైనా ఒప్పించాలని వారు అనుకుంటున్నారట. మరోవైపు విడుదల తేది విషయంలో అటు మహేష్ టీమ్ కూడా పక్కాగా ఉందట. అల వైకుంఠపురములోను ముందే విడుదల చేస్తే.. అదే రోజే తమ సినిమాను కూడా విడుదల చేయాలని సరిలేరు టీమ్ అనుకుంటున్నట్లు టాక్. మరి మొత్తానికి ఈ సంక్రాంతి పోరు ఎలా ఉండబోతోంది..? ఈ వివాదాన్ని దిల్ రాజు ఎలా పరిష్కరిస్తారు..? దిల్ రాజును బన్నీ కన్విన్స్ చేస్తాడా..? అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.