అవి లేకుండా అన్నయ్యను నేనే చూడలేను.. ఫ్యాన్స్‌కి వినాయక్ భరోసా

| Edited By:

Oct 27, 2020 | 4:11 PM

మోహన్ లాల్ హీరోగా మలయాళంలో ఘన విజయం సాధించిన లూసిఫర్‌ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

అవి లేకుండా అన్నయ్యను నేనే చూడలేను.. ఫ్యాన్స్‌కి వినాయక్ భరోసా
Follow us on

Chiranjeevi Lucifer Remake: మోహన్ లాల్ హీరోగా మలయాళంలో ఘన విజయం సాధించిన లూసిఫర్‌ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్‌లో నటించనున్నారు. మొదట ఈ ప్రాజెక్ట్‌కి సాహో ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వం వహించనున్నట్లు చిరంజీవి ప్రకటించినప్పటికీ.. కొన్ని కారణాల వలన అతడు ఈ రీమేక్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో చిరుకు రెండు మంచి హిట్లు ఇచ్చిన వివి వినాయక్‌ లైన్‌లోకి వచ్చారు.

కాగా మలయాళం లూసిఫర్‌లో పాటలు పెద్దగా ఉండవు. మోహన్‌లాల్‌కి హీరోయిన్‌ కూడా ఉండదు. సీరియస్‌గా సాగే కథ కాబట్టి అవి లేకపోవడంతోనే అక్కడ సినిమా హిట్‌ అయ్యింది. కానీ ఇక్కడి అభిమానుల టేస్ట్‌ వేరు. డ్యాన్స్‌లు లేకుండా చిరు సినిమా చూడటం వారికి కొంచెం కష్టం లాంటిదే. ఆయన నటించిన సైరాలోనూ ఇలాంటి సందర్భమే ఎదురైంది. సైరాలో చిరు డ్యాన్స్‌లు పెద్దగా ఉండవు. తమన్నా, చిరుపై ఒక పాటను షూట్ చేసినప్పటికీ.. నిడివి నేపథ్యంలో దాన్ని తీసేశారు. దీంతో సైరా వారికి నచ్చినప్పటికీ.. చిరు డ్యాన్స్‌ చూడలేదన్న అసంతృప్తి వారిలో ఓ మూల ఉండిపోయింది. ఇక లూసిఫర్‌ రీమేక్‌లో చిరు నటించనున్నాడని తెలిసినప్పటి నుంచి.. ఇందులోనూ అన్నయ్య డ్యాన్స్‌లు చూడలేమోనని వారు భావించారు.

ఇలాంటి నేపథ్యంలో వినాయక్‌ వారికి భరోసా ఇచ్చారు. చిరు ఇమేజ్‌కి తగ్గట్లుగా ఆయన లూసిఫర్‌లో పలు మార్పులు చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. డ్యాన్స్‌లు, పాటలు లేకుండా అన్నయ్యను తానే చూడలేనని.. లూసిఫర్ రీమేక్‌లో అవి కచ్చితంగా ఉంటాయని వినాయక్ తెలిపారు. దీంతో అభిమానులకు ఆయన భరోసా ఇచ్చినట్లు అయ్యింది. కాగా ప్రస్తుతం ఆచార్యలో నటిస్తోన్న చిరు.. ఆ తరువాత మెహర్ రమేష్‌ దర్శకత్వంలో వేదాళం రీమేక్‌లో నటించనున్నారు. దాంతో పాటు లూసిఫర్ రీమేక్‌ సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

Read More:

Bigg Boss 4: అభి, అఖిల్‌ మధ్య మొదలైన స్నేహం

నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్‌