రేర్ కాంబినేషన్‌ రిపీటా..? సెకండ్‌ ఇన్నింగ్స్ జోరుగా..!

| Edited By:

Sep 26, 2019 | 4:06 PM

సినిమాల్లో.. ‘సూపర్ లేడీ’ అని పిలుపించుకున్న విజయశాంతి.. రాజకీయాల్లోకి ఎంటర్‌ అయిన తర్వాత.. సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. పాలిటిక్స్‌లో బిజీ బిజీగా ఉండే.. విజయశాంతి.. సడన్‌గా మహేష్ బాబు హీరోగా.. వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’తో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సినిమాలో కీలకమైన రోల్‌లో ఆమె నటిస్తున్నట్టు సమాచారం. ఓ కాలేజీకి ‘లెక్చరర్‌’గా ఆమె ఈ చిత్రంలో నట్టిస్తున్నట్టు సమాచారం. చివరిగా.. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమాలో నటించిన విజయశాంతి.. ఆ తరువాత ఏ సినిమాలు చేయలేదు. కాగా.. […]

రేర్ కాంబినేషన్‌ రిపీటా..? సెకండ్‌ ఇన్నింగ్స్ జోరుగా..!
Follow us on

సినిమాల్లో.. ‘సూపర్ లేడీ’ అని పిలుపించుకున్న విజయశాంతి.. రాజకీయాల్లోకి ఎంటర్‌ అయిన తర్వాత.. సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. పాలిటిక్స్‌లో బిజీ బిజీగా ఉండే.. విజయశాంతి.. సడన్‌గా మహేష్ బాబు హీరోగా.. వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’తో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సినిమాలో కీలకమైన రోల్‌లో ఆమె నటిస్తున్నట్టు సమాచారం. ఓ కాలేజీకి ‘లెక్చరర్‌’గా ఆమె ఈ చిత్రంలో నట్టిస్తున్నట్టు సమాచారం. చివరిగా.. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమాలో నటించిన విజయశాంతి.. ఆ తరువాత ఏ సినిమాలు చేయలేదు.

కాగా.. ఇదిలావుంటే.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కొరటాల శివ దర్శకత్వంలో.. చిరు సరసన ఆమె నటించబోతున్నారని సమాచారం. అలాగే.. మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా.. ‘ఎఫ్2’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఎఫ్3’ ప్లాన్‌ చేస్తున్నారని.. అందులో.. ఓ మంచి పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించారని సమాచారం. అంతేకాకుండా.. ఆ పాత్ర చేయడానికి లెడీ హీరో కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల నుంచి సమాచారం. ఏదేమైనా..సెకండ్ ఇన్నింగ్స్‌లో విజయశాంతి జోరు పెంచింది.