‘వెంకీమామ’ మేకింగ్ వీడియో.. రెచ్చిపోయిన మామాఅల్లుళ్లు

| Edited By:

Aug 02, 2019 | 8:38 AM

వెంకటేష్, నాగచైతన్యలు కలిసి నటిస్తోన్న క్రేజీ చిత్రం ‘వెంకీ మామ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక తాజాగా బాబీ పుట్టినరోజు సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది టీమ్. అందులో మామా అల్లుళ్లిద్దరు రెచ్చిపోయారు. చూస్తుంటే వీరిద్దరు ఏదో మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందులో వెంకటేష్ రైతు పాత్రలో కనిపిస్తుండగా.. చైతూ ఆర్మీ జవాన్ పాత్రలో నటించనున్నాడు. పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నా […]

‘వెంకీమామ’ మేకింగ్ వీడియో.. రెచ్చిపోయిన మామాఅల్లుళ్లు
Follow us on

వెంకటేష్, నాగచైతన్యలు కలిసి నటిస్తోన్న క్రేజీ చిత్రం ‘వెంకీ మామ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక తాజాగా బాబీ పుట్టినరోజు సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది టీమ్. అందులో మామా అల్లుళ్లిద్దరు రెచ్చిపోయారు. చూస్తుంటే వీరిద్దరు ఏదో మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇందులో వెంకటేష్ రైతు పాత్రలో కనిపిస్తుండగా.. చైతూ ఆర్మీ జవాన్ పాత్రలో నటించనున్నాడు. పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే నిజజీవితంలో మేనమామ, మేనల్లుడైన వెంకటేష్, చైతూ.. ఈ మూవీలో మామఅల్లుళ్లుగా కనిపించబోతున్నారు. దీంతో ఈ కాంబోపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఇదివరకు చైతూ నటించిన ప్రేమమ్‌లో వెంకీ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.