మొదలైన ఎఫ్3.. షూటింగ్ లో జాయినైన వెంకటేష్ .. మోర్ ఫన్ తో రాబోతున్న అనీల్ రావిపూడి

|

Dec 23, 2020 | 9:08 PM

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్  సినిమాను..

మొదలైన ఎఫ్3..  షూటింగ్ లో జాయినైన వెంకటేష్ .. మోర్ ఫన్ తో రాబోతున్న అనీల్ రావిపూడి
Follow us on

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘నారప్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’  సినిమాను ‘నారప్ప’గా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన వెంకటేష్ లుక్స్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో కలిసి ‘ఎఫ్3’ సినిమా చేస్తున్నాడు వెంకీ.

యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్2’ సినిమాలో నవ్వులు పూయించిన వెంకీ మరోసారి మోర్ ఫన్ తో రాబోతున్నాడు. అనిల్‌రావిపూడి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ‘ఎఫ్3’ మూవీ షూటింగ్ బుధవారం మొదలైంది. హైదరాబాద్ లో ప్రారంభమైన షూటింగ్ లో వెంకీతో సోలో సీన్లను షూట్ చేసాడు అనీల్. త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్ రెడ్డి ఇత‌ర కీలక పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా..దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 70 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు అనీల్.