Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్.. బాక్సింగ్ పంచ్‌తో అదరగొడుతున్న మెగా హీరో..

|

Jan 19, 2021 | 11:46 AM

Varun Tej's Ghani movie: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో వరుణ్ తేజ్‌ది సఫరేట్ రూట్. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో

Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్.. బాక్సింగ్ పంచ్‌తో అదరగొడుతున్న మెగా హీరో..
Follow us on

Varun Tej’s Ghani movie: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో వరుణ్ తేజ్‌ది సఫరేట్ రూట్. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. ఫిదా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వరుణ్ ఆ తర్వాత గద్దల కొండ గణేశ్‌తో తన నటనను నిరూపించుకున్నాడు. ఎఫ్2 తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటితో సినిమా చేస్తున్నాడు.

అయితే ఇవాళ వరుణ్ తేజ్ పుట్టిన రోజు కావడం వల్ల చిత్రయూనిట్ ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ మూవీ సినిమా టైటిల్‌తో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. బాక్సింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ‘గని’ అని టైటిల్‌ ఖరారు చేశారు. బాక్సింగ్ రింగ్ లో పంచ్‌లు కొడుతున్న వ‌రుణ్ లుక్‌ని మోషన్‌ పోస్టర్‌లో చూపించారు. ఈ చిత్రంలో హీరో పేరు గని అందుకే సినిమాకి కూడా అదే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ఈ పాత్రలో స్టార్ హీరో ఉపేంద్ర చేయనున్నాడు. వ‌రుణ్ తేజ్ కి కోచ్ గా.. సునీల్ శెట్టి, ప్రతినాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నాడు.