varun tej tested negative : కరోనాను జయించిన మెగాహీరో.. నెగిటివ్ అనే పదం ఇంత ఆనందాన్ని ఇస్తుందనుకోలేదట..!

|

Jan 07, 2021 | 1:30 PM

ఇటీవల మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మేఘ పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్  అని నిర్ధారణ అయిన వెంటనే మరో మెగా హీరో వరుణ్ తేజ్..

varun tej tested negative : కరోనాను జయించిన మెగాహీరో.. నెగిటివ్ అనే పదం ఇంత ఆనందాన్ని ఇస్తుందనుకోలేదట..!
Follow us on

varun tej tested negative : ఇటీవల మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మేఘ పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్  అని నిర్ధారణ అయిన వెంటనే మరో మెగా హీరో వరుణ్ తేజ్ కు పాజిటివ్ గా తేలింది. దాంతో అభిమానులంతా కాస్త కంగారు పడ్డారు. చిన్న చిన్న లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు వరుణ్.

తాజాగా ఈ యంగ్ హీరో కరోనాను జయించాడు. తాజాగా త‌న‌కు క‌రోనా నెగెటివ్ వ‌చ్చిన‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. నా జీవితంలో నెగెటివ్ అనే ప‌దం ఇంత ఆనందాన్ని ఇస్తుంద‌ని ఎప్పుడు ఊహించ‌లేదు. నాకు క‌రోనా నెగెటివ్ అని తేలింది. మీ ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌కు ధ‌న్య‌వాదాలు అని వరుణ్ తేజ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వరుణ్ బాక్సర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో పాటు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు.