అదేంటో నా పెళ్లి గురించి నాకే చివర్లో తెలుస్తోంది..!

ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అతి తక్కువ మంది హీరోయిన్లలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఫిల్మ్‌ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చినప్పటికీ..

అదేంటో నా పెళ్లి గురించి నాకే చివర్లో తెలుస్తోంది..!

Edited By:

Updated on: May 19, 2020 | 7:36 PM

ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అతి తక్కువ మంది హీరోయిన్లలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఫిల్మ్‌ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరోయిన్‌ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. కాగా ఇటీవల ఈ హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు గుప్పుమన్నాయి. ఓ క్రికెటర్‌ను ఈ నటి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలో వాటిపై తాజాగా తన సోషల్ మీడియాలో స్పందించింది వరలక్ష్మి.

”ఎందుకో నా పెళ్లి విషయం అందరి కంటే నాకే చివర్లో తెలుస్తోంది..? హా హా హా .. మళ్లీ అవే నాన్సెన్స్‌ రూమర్లు. నా పెళ్లి గురించి ఎందుకో అందరికీ అంత ఆసక్తి. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే.. ఆ వార్తను ఇంటి పైకి వెళ్లి గట్టిగా అరిచి చెప్తాను. అప్పుడు కావాలంటే వార్త రాసుకోండి. నేను పెళ్లి చేసుకోవడం లేదు. సినిమాలు వదిలేయడం లేదు” అని వరలక్ష్మి ట్వీట్ చేసింది. ఈ మేరకు ఆమె ఓ కోట్‌ను కూడా పోస్ట్ చేసింది. అందులో ”రూమర్ల వలన నా గురించి నాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నా” అని ఉంది. కాగా ఈ నటి ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా నటిస్తోన్న ‘క్రాక్’‌లో కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: KGF 2: సంజయ్‌దత్ లుక్‌ లీక్‌.. ‘అధీర’ అదరగొట్టేస్తున్నాడుగా..!

Loading...
Unable to load recommendations.
Follow Us