Varalaxmi Sarathkumar : రాధికా పై వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసక్తికర కామెంట్లు.. ఆమె నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.

|

Jan 20, 2021 | 6:10 AM

ఇటీవల కాలం లో లేడీ విలన్ అవసరమైతే  అందరికి గుర్తొచ్చే మొదటిపేరు వరలక్ష్మీ శరత్ కుమార్ అనే చెప్పుకోవాలి.  ఇప్పుడు లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ శరత్ కుమార్ పెట్టింది పేరు..

Varalaxmi Sarathkumar : రాధికా పై వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసక్తికర కామెంట్లు.. ఆమె నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.
సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ.
Follow us on

Varalaxmi Sarathkumar : ఇటీవల కాలంలో లేడీ విలన్ అవసరమైతే  అందరికి గుర్తొచ్చే మొదటిపేరు వరలక్ష్మీ శరత్ కుమార్ అనే చెప్పుకోవాలి.  ఇప్పుడు లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ శరత్ కుమార్ పెట్టింది పేరుగా మారింది. ముందుగా హీరోయిన్ గా తన కెరియర్ ను ప్రారంభించినప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరిస్తుంది. ‘విక్రమ్ వేదా’ ‘విష్మయ’ ‘మాణిక్యా’ ‘కసాబా’ వంటి చిత్రాల్లో అద్భుతమైన యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది . ఇక ‘పందెం కోడి 2′ ‘సర్కార్’ వంటి చిత్రాల్లో లేడీ విలన్ గా కనిపించి సత్తాచాటింది. ఇలా ఆమె పోషించిన సినిమాలు .. పాత్రలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలో కూడా వరలక్ష్మీ విలన్ గా మెప్పించింది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సవతి తల్లి రాధిక గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నా తల్లి కాదు. కానీ.. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నా కెరియర్ కు సంబంచిన సూచనలు చేస్తూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. నేను ఆమెకు ఏదైనా రహస్యం చెబితే.. దాన్ని వెంటనే లీక్ చేసేస్తుంది. అందులో దురుద్దేశం ఉండదు.. అలా పొరపాటున జరిగిపోతుంది. ఇలా చాలా సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు ఆమె అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మీ.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఆసుపత్రిలో చేరిన ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ.. ఆ సినిమా షూటింగ్‏లో ఉండగానే.. అసలు కారణం ఏంటంటే ?