మూడో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తంజావూర్ సంప్రదాయమన్న నటి

| Edited By:

Jul 26, 2020 | 2:11 PM

వివాదాస్పద నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ వనితా విజయ్‌కుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన పీటర్‌ పాల్‌ని వనితా గత నెలలో పెళ్లి చేసుకుంది.

మూడో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తంజావూర్ సంప్రదాయమన్న నటి
Follow us on

Vanitha Vijayakumar Controversy: వివాదాస్పద నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ వనితా విజయ్‌కుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన పీటర్‌ పాల్‌ని వనితా గత నెలలో పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఆమెపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పీటర్ పాల్, తనకు విడాకులు ఇవ్వకుండానే వనితాను వివాహం చేసుకున్నాడని అతడి మొదటి భార్య ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చాలా మంది వనితాను విమర్శిస్తున్నారు. వారందరికీ ఘాటు సమధానాలను ఇస్తున్న వనితా.. ఒక దశలో సంయమనాన్ని కోల్పోయి నోరు జారారు. తాను పెళ్లి చేసుకోవడం సరైందేనని సమర్థించుకున్న వనితా.. తన స్వస్థలాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

తంజావూర్‌లో రెండో పెళ్లి చేసుకోవడం అన్నది కామన్‌. ఎంతో మంది రెండో పెళ్లి చేసుకున్నారు. మా నాన్న కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొన్ని కారణాలతో నేను మూడో పెళ్లి చేసుకున్నా. తంజావూర్ సంప్రదాయం ప్రకారమే నేను వివాహం చేసుకున్నా అని కామెంట్లు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తంజావూర్ గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించాయి. మూడో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తంజావూర్ సంప్రదాయమని ప్రచారం చేయడం ఏంటని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ క్రమంలో వనితాపై ట్రోలింగ్‌ ఎక్కువవ్వగా.. తన అకౌంట్‌ని కూడా డీయాక్టివేట్ చేసుకున్నారు. కానీ దీని వలన మరింత డ్యామేజీ అవుతుందని భావించి తిరిగి తన అకౌంట్‌ని యాక్టివేట్ చేసి క్షమాపణలు చెప్పారు.

”నా మాటల వలన తంజావూర్ ప్రజల మనోభావాలు దబ్బ తిన్నట్లు అయితే వారికి నేను క్షమాపణలు చెబుతున్నా. నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఉద్దేశ పూర్వకంగా ఈ ఈ మాటలు అనలేదు. నా మాతృ భూమి అంటే నాకు ఎప్పటికీ గౌరవం” అని ట్వీట్ చేశారు.

Read This Story Also: మరి కొన్ని గంటల్లో పెళ్లనగా.. వధువుకు కరోనా నిర్ధారణ