ఎనిమిదేళ్ల క్రితమే మా ఆయన ఆమెతో విడిపోయారు: వనితా

| Edited By:

Jun 29, 2020 | 3:29 PM

నటి, బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ వనితా విజయ్‌కుమార్‌ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన పీటర్‌ పాల్ అనే వ్యక్తిని వనితా క్రైస్తవ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు.

ఎనిమిదేళ్ల క్రితమే మా ఆయన ఆమెతో విడిపోయారు: వనితా
Follow us on

నటి, బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ వనితా విజయ్‌కుమార్‌ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన పీటర్‌ పాల్ అనే వ్యక్తిని వనితా క్రైస్తవ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహం అయిన మరుసటి రోజే ఈ ఇద్దరిపై పీటర్‌ మొదటి భార్య ఎలిజిబెత్‌ హెలెన్‌ కేసు వేశారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్‌, వనితాను వివాహం చేసుకున్నాడని.. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఏడు ఏళ్లుగా విడిగా ఉంటున్నామని ఎలిజిబెత్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక ఈ ఫిర్యాదుపై వనితా స్పందించారు. పీటర్‌ మొదటి భార్య డబ్బుల కోసమే ఇలా చేస్తుందని ఆమె అన్నారు. ఎలిజిబెత్‌ కోటి రూపాయాలు ఇవ్వాలంటూ తమను డిమాండ్ చేసిందని, కానీ తమ దగ్గర అంత డబ్బులు లేవని వనితా తెలిపారు. ఎలిజిబెత్‌, పీటర్‌ ఎనిమిది సంవత్సరాల క్రితమే విడిపోయారని వనితా చెప్పుకొచ్చారు. కుట్రతోనే ఎలిజిబెత్‌ ఇలా చేస్తుందని, ఈ విషయాన్ని న్యాయపరంగానే తాను, తన భర్త ఎదుర్కొంటామని వనితా స్పష్టం చేశారు. పెళ్లి అయిన తరువాత తన జీవితం బావుందని వనితా చెప్పుకొచ్చారు.