కాయాకష్టం చేసుకుంటూ జీవనం.. 90లక్షలతో సినిమా.. కల నిజం చేసుకున్న ఓ మహిళ

|

Aug 06, 2024 | 11:38 AM

అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టు "పాలిచ్చి పెంచే ఆడవాళ్లు.. సార్ పాలించడం వాళ్లకు ఓ లెక్క" అనేడైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అలాగే ఇప్పుడు చెన్నెబోయిన వెంకట నరసమ్మ  పొలం పనులు చేసుకుంటూ సినిమా తీసి నిరూపించింది. తాజాగా ఆమె ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ.. 

కాయాకష్టం చేసుకుంటూ జీవనం.. 90లక్షలతో సినిమా.. కల నిజం చేసుకున్న ఓ మహిళ
Venkata Narasamma
Follow us on

ఒక సినిమా తీయడం అంటే ఎంత కష్టమో అందరికి తెలిసిందే.. ఒక సామాన్యులు, కూలీనాలీ చేసుకునే వాళ్ళు ఓ సినిమా తీయడం అసాధ్యం. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సినిమా తీయాలంటే మినిమమ్ 25, 30లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. కానీ ఓ సామాన్యుడు.. అదికూడా ఓ మహిళ సినిమా చేయడం దాదాపు అసాధ్యం. కానీ ఇవన్నీ తనకు సాధ్యం అని నిరూపించింది. కూలీ చేసుకునే మహిళ తలచుకుంటే సినీ తీయడం పెద్ద విషయం కాదు అని నిరూపించింది ఆమె. కాయకష్టం చేసుకునే ఓ సామాన్య మహిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సినిమా చేసి చూపించింది. ఆమె పేరు చెన్నెబోయిన వెంకట నరసమ్మ. పెద్దగా చదువుకోలేదు.. టీవీల్లో థియేటర్స్ లో సినిమాలు చూసి సినిమా పై ఇష్టాన్ని పెంచుకుంది.

అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టు “పాలిచ్చి పెంచే ఆడవాళ్లు.. సార్ పాలించడం వాళ్లకు ఓ లెక్క” అనేడైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అలాగే ఇప్పుడు చెన్నెబోయిన వెంకట నరసమ్మ  పొలం పనులు చేసుకుంటూ సినిమా తీసి నిరూపించింది. తాజాగా ఆమె ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ..

నాభర్త వెంకటేశ్వర్లు ఓ రైతు.. పెళ్లైన తర్వాత నేను నా భర్త కలిసి పుట్టింటికి రా చెల్లి సినిమా చూశాం.. ఆ సినిమా చూస్తూ నేను చాలా ఏడ్చేశాను.  అప్పుడే ఎలాగైనా సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాను. సినిమా తీయడానికి డబ్బులు కావాలి కాబట్టి నేను ఓ పెద్ద డబ్బా కొన్నాను. మాకు మూడెకరాల పొలం, 70 గొర్రెలు, కొన్ని మేకలు, 30 గేదెలు ఉండేవి.. పొలం పనులు చేసుకుంటూ.. పాలు అమ్ముకుంటూ డబ్బులు సంపాదించేదాన్ని.. కుటుంబానికి కొంతం డబ్బు వాడుతూ.. కొన్ని డబ్బులను ఓ డబ్బాలో దాచిపెట్టాను. ఇరవై ఏళ్లుగా వందా రెండొందలూ వెయ్యి చొప్పున అందులో వేస్తూ దాచుకున్నాను. నేను ఒకసారి ఇంట్లో నేను సినిమా తీయాలని అనుకుంటున్నా అని చెప్పాను. నాకొడుకు నమ్మలేదు. నన్ను విసుగు తెచ్చుకొని ఎంత దాచావో తీసుకురా..? అని అన్నారు.

ఆ డబ్బా ఓపెన్ చేసి చూస్తే దాదాపు రూ.29 లక్షలు పైనే ఉన్నాయి. అది చూసి మావాళ్లు షాక్ అయ్యారు. అయితే సినిమా చేయాలంటే ఈ  డబ్బు సరిపోదు అని చెప్పారు. దాంతో ఇంకా డబ్బులు సంపాదించే పనిలో పడ్డాను. కూలికి వెళ్లా, చెరకు రసం అమ్మా, టిఫిన్‌ బండి పెట్టా.. కరోనా సమయంలో ఎక్కడో దూరంగా ఊరి బయట రాగి జావ అమ్మాను. మొత్తంగా డబ్బు బాగానే కూడబెట్టాను. నా సినిమా పిచ్చి చూసి నా బిడ్డ నాతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆతర్వాత అతన్ని వెతికి పట్టుకున్నాను. నా పట్టుదలచూసి చివరకు నా కొడుకు నన్ను నమ్మాడు. నేను చెప్పినట్టు ఓ కథ రాశాడు. ఆతర్వాత హైదరాబాద్ లో సినిమా ఆఫీస్ లో పని చేశాడు. చాలా మందిని కలిశాడు. చివరికు నటుడు రవిబాబుని కలిస్తే ఆయన సినిమా చేయడనికి ఒప్పుకున్నాడు. అలాగే నా పట్టుదల చూసి మెచ్చుకున్నారు. మాతంగి ఆచారం గురించి ఆడవాళ్లు జీవితం గురించి సినిమా చేశాం.. స్పిరిట్‌ (ఈజ్‌ నాట్‌ వన్‌) అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే నా కొడుకు, భర్త సినిమా పనులు చూసుకుంటున్నారు. నేను రోజు గడవాలి కాబట్టి నేను టిఫిన్ బండి నడుపుతున్నాను అని తెలిపింది చెన్నెబోయిన వెంకట నరసమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.