
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. హీరోగా నాగార్జున కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు నాగార్జున. ఇప్పటికే 99 సినిమాలతో అలరించిన నాగార్జున ఇప్పుడు 100వ సినిమాకోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నాగ్. ఇటీవలే నాగ్ రూట్ మార్చి విలన్ రోల్స్ లోనూ కనిపిస్తున్నారు. ఇటీవకే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో విలన్ గా అదరగొట్టారు నాగ్. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ నాగ్ మాత్రం ఇరగదీశారనే చెప్పాలి. నిజం చెప్పాలంటే కూలి సినిమా వల్ల నాగ్ క్రేజ్ మరింత పెరిగింది. సినిమా మొత్తం ఆయనే డామినేట్ చేశారు. తమిళ్ ఆడియన్స్ నాగ్ కు ఫిదా అయ్యారు. అప్పుడెప్పుడో వచ్చిన రాక్షసుడు సినిమాలో ఎలా ఉన్నడో ఇప్పుడూ అలానే ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు నాగ్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఇది నాగ్ కెరీర్ లో 100వ సినిమా.. ఈ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపనున్నారని తెలుస్తుంది. నాగార్జున 100వ సినిమాకు లాటరీ కింగ్ అనే ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ్ కోసం రంగంలోకి ఓ స్టార్ హీరోయిన్ తీసుకురానున్నారని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు నాగార్జున ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులు ఉప్పొంగిపోయేవారు. ఆమె ఎవరో కాదు అందాల భామ టబు.. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కాగా టబు హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.
మొన్నామధ్య అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించింది. ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తుంది. ఇటీవలే ఆమె పూరిజగన్నాథ్ , విజయ్ సేతుపతి కాంబినేషన్ లో రానున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె విలన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే టబు ఇప్పుడు కింగ్ నాగార్జున సినిమాలోనూ నటిస్తుందని తెలుస్తుంది. నాగార్జున టబు కలిసి నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే సినిమాలు చేశారు. అలాగే నాగార్జున నటించిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అప్పట్లో ఈ ఇద్దరి జోడీగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత నాగ్, టబు కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దాదాపు 27ఏళ్ల తర్వాత టబుతో కలిసి నటించనున్నారు నాగ్. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది చూడాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.