S. S. Rajamouli: రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్‌‌ను తారక్, చరణ్ బ్రేక్ చేయనున్నారా.?

|

Jan 30, 2023 | 9:58 AM

ఇప్పుడు ఇద్దరు టాప్ హీరోలు ఈ ఫేజ్‌ను ఫేస్ చేస్తున్నారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్‌ తరువాత క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టి ఆడియన్స్‌ అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకున్నారు.

S. S. Rajamouli: రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్‌‌ను తారక్, చరణ్ బ్రేక్ చేయనున్నారా.?
Rrr
Follow us on

టాలీవుడ్‌లో దర్శక ధీరుడికి ఓ బ్యాడ్ సెంటిమెంట్‌ ఉంది. ఆయనతో సినిమా చేస్తే.. ఆ హీరో మళ్లీ సక్సెస్‌ చూడాలంటే చాలా టైమ్‌ పడుతుంది. ఇప్పుడు ఇద్దరు టాప్ హీరోలు ఈ ఫేజ్‌ను ఫేస్ చేస్తున్నారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్‌ తరువాత క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టి ఆడియన్స్‌ అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ట్రిపులార్‌. బాహుబలి తరువాత జక్కన్న కాంపౌండ్ నుంచి వచ్చిన మూవీ కావటంతో రిలీజ్‌కు ముందు నుంచే ట్రిపులార్ మీద పాన్ ఇండియా రేంజ్‌లో బజ్‌ క్రియేట్ అయ్యింది. రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను నిజంగా చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది ట్రిపులార్.

ట్రిపులార్‌తో తారక్‌, చరణ్‌ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లుగా మారటంతో.. ఈ హీరోల అప్‌కమింగ్ సినిమాల విషయంలోనూ అదే రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఆల్రెడీ గ్రేట్ డైరెక్టర్ శంకర్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు చరణ్. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్‌ చేశారు మెగా పవర్ స్టార్‌. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న బుచ్చిబాబు దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు.. చరణ్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారన్న విషయంలో భారీ హైప్‌ క్రియేట్ అవుతోంది.

ట్రిపులార్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న తారక్‌కు ఈ వెయిటింగ్ వర్తీనే అంటున్నారు. మాస్ కమర్షియల్ సినిమా స్పెషలిస్ట్ కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ ఎనౌన్స్‌ చేసిన జూనియర్‌, ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమా మీద అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ జూనియర్‌ అభిమానులకే కాదు… మూవీ లవర్స్ అందరి మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లోనే ఉంది. కొరటాల మూవీ తరువాత ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు తారక్‌. ఆల్రెడీ సలార్‌తో బిగ్‌ రికార్డ్‌ను టార్గెట్‌ చేసిన ప్రశాంత్ నీల్‌, నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమాతో ఆ రికార్ట్స్‌ను తానే బ్రేక్ చేసేందుకు ప్రీపేర్ అవుతున్నారు.

ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ డిలే అయితే… ఇమిడియట్‌గా త్రివిక్రమ్‌ను బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారు తారక్‌. ఆల్రెడీ అరవింద సమేత లాంటి బిగ్‌ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌లో మరో మూవీ సెట్స్ మీదకు వస్తే.. ఆటోమేటిక్‌గా అది మోస్ట్ అవెయిటెడ్‌ లిస్ట్‌లోనూ ఫ్లాష్ అవుతుంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు