Allu Arjun: ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్జున్ కామియో అప్పియరెన్స్ ఇవ్వనున్నారా..

|

Apr 04, 2023 | 9:57 AM

కానీ ఆ సినిమా ఏంటనే దానిపై మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకూ క్లారిటీ లేకుండా పోయింది. బన్నీ ఫ్యాన్స్ ను ఇదే విషయం ఎప్పటి నుంచో కన్ఫ్యూజ్ అయ్యేలా కూడా చేస్తోంది.

Allu Arjun: ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్జున్ కామియో అప్పియరెన్స్ ఇవ్వనున్నారా..
Allu Arjun
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ బాలీవుడ్‌ మూవీలో కామియో అప్పియరెన్స్ ఇస్తున్నారనే న్యూస్ ఎప్పటి నుంచో అంతటా వైరల్ అవుతోంది. కానీ ఆ సినిమా ఏంటనే దానిపై మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకూ క్లారిటీ లేకుండా పోయింది. బన్నీ ఫ్యాన్స్ ను ఇదే విషయం ఎప్పటి నుంచో కన్ఫ్యూజ్ అయ్యేలా కూడా చేస్తోంది. అయితే వీరి కన్ఫ్యూజన్‌కు ఎట్టకేలకు పులిస్టాప్ పడింది. తాజాగా రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ వీడియో సాంగ్‌లో.. బన్నీ దొరికిపోవడంతో.. విషయం బయటపడింది. ఇప్పుడిదే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సల్మాన్ ఖాన్.. విక్టరీ వెంకటేష్‌ లీడ్‌ రోల్స్‌లో.. చేస్తున్న ఫిల్మ్ కిసీ కా భాయ్‌.. కిసీ కి జాన్‌. పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌స్‌ కాటమరాయుడు సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కిన ఈ సినిమాలో.. బన్నీ క్యామిమో అప్పియరెన్స్ ఇస్తున్నారనే విషయం ఓ వీడియో కారణంగా తేలిపోయింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఎంటమ్మా అనే సాంగ్ టీజర్‌ రిలీజ్ అయింది. ఇక ఈ టీజర్లోని ఓ సీన్లో.. సల్మాన్‌ వెంకీ ఎవరినో చూస్తున్నట్టు వెల్‌కమ్‌ చెబుతున్నట్టు ఓ సీన్‌ ఉంది. అయితే ఆ సీన్లో వారి వైపుకు వెళ్తున్న వ్యక్తి… వెనక నుంచి అచ్చం అల్లు అర్జున్‌లాగే ఉండడం. పుష్ప గెటప్‌లో కనిపిండం.. ఇప్పుడు అల్లు అర్జున్ ఈసినిమాలో కనిపిస్తున్నారనే న్యూస్ బయటకు వచ్చేలా చేసింది. అంతేకాదు.. కొంత మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇదే ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసి మరీ.. బల్లగుద్ది చెప్పేలా చేస్తోంది.