ఇదెక్కడి సినిమారా మావ..! చూస్తే గుండె ప్యాంట్‌లోకి జారాల్సిందే

|

May 25, 2024 | 7:22 PM

ప్రేక్షకులు ముఖ్యంగా థ్రిల్ గా అనిపించే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా హారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది హారర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు దాదాపు హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లోనూ చాలా హారర్ సినిమాలు తెరకెక్కాయి. హారర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే హారర్ సినిమాలంటే భయపడే వారు కూడా కళ్ళు మూసుకుంటూనే ఆ సినిమాలను చూడటాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ఇదెక్కడి సినిమారా మావ..! చూస్తే గుండె ప్యాంట్‌లోకి జారాల్సిందే
Horror Movie
Follow us on

ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించడానికి చాలా రకాల సినిమాలు ఉన్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు ముఖ్యంగా థ్రిల్ గా అనిపించే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా హారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. హారర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు దాదాపు హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లోనూ చాలా హారర్ సినిమాలు తెరకెక్కాయి. హారర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే హారర్ సినిమాలంటే భయపడే వారు కూడా కళ్ళు మూసుకుంటూనే ఆ సినిమాలను చూడటాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ హారర్ మూవీని మిస్ అవ్వకండి. ఓటీటీలో ఈ హారర్ మూవీ అదరగొడుతోంది. భారీ వ్యూస్ తో ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సినిమాను ఒంటరిగా ఉన్నప్పుడు చూడకండి. ఖచ్చితంగా భయపడతారు.

ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమాల్లో హాలీవుడ్ మూవీ స్మైల్ ఒకటి. 2022 లో థియేటర్లలో విడుదలైన హాలీవుడ్ సినిమా ఇది. స్మైల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. లారా హాజెంట్ స్లేప్ట్ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా చాలా డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కింది. నవ్వు ఒక వైరస్ గా చూపించారు. భయంకరమైన ఆ నవ్వు చూసిన వారు బ్రతకరు. మనిషిని మానసికంగా కృంగదీసి ఆతర్వాత చనిపోయేలా చేస్తుంది ఆ నవ్వు.

ఈ సినిమా 2023 జూన్ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో  రెంట్ తో ఈ సినిమా చూడొచ్చు.ఈ సినిమా అనుక్షణం ఉత్కంఠభరితంగా.. ప్రతి సీన్ సుస్సు పోయించేలా ఉంటుంది. ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులంతా ఆసక్తిచూపిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీ ఊహించని ట్విస్ట్ లు, ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.