Acharya Movie : భారీ ధరపలికిన ‘ఆచార్య’ నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్.. ఎవరు దక్కించుకున్నారంటే..

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది...

Acharya Movie : భారీ ధరపలికిన ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్.. ఎవరు దక్కించుకున్నారంటే..

Updated on: Feb 04, 2021 | 9:46 PM

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నరు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే చరణ్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఇక ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. తాజాగా ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నాడు.

నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఎప్పుడు దిల్ రాజు సొంతం చేసుకుంటారు. ఇక పెద్ద సినిమాల సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వరంగల్ శ్రీను సొంతం అయ్యాయి. కాగా ఇటీవల విడుదలైన క్రాక్ సినిమా సమయంలో నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తనకు సరిగ్గా థియేటర్స్ ఇవ్వడం లేదు అంటూ ఆరోపించారు వరంగల్ శ్రీను. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నైజాం హక్కులను ఏకంగా 42 కోట్లు చెల్లించి వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆచార్య సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 13న సినిమా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Producer Ms Raju : ప్రముఖ నిర్మాత ఇంట పెళ్ళిసందడి.. మూడు రోజులపాటు జరగనున్నపెళ్లివేడుక..

 

Loading...
Unable to load recommendations.
Follow Us