సంతూర్ మమ్మీ గుర్తుందా.? ప్రజెంట్ ట్రెండింగ్.. ఇప్పుడెలా ఉందో చూస్తే మెంటలెక్కిపోతుంది

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న మినిమం గ్యారెంటీ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. ‘ఈ నగరానికి ఏమైంది’ నుంచి ‘ఫలక్‌నుమా దాస్’, ‘HIT: ది ఫస్ట్ కేస్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా దమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ దాకా వరుస హిట్లు కొట్టాడు విశ్వక్ సేన్. అయితే గత నవంబర్‌లో..

సంతూర్ మమ్మీ గుర్తుందా.? ప్రజెంట్ ట్రెండింగ్.. ఇప్పుడెలా ఉందో చూస్తే మెంటలెక్కిపోతుంది
Tollywood

Updated on: Feb 15, 2025 | 9:27 PM

టాలీవుడ్ టైర్-2 హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘HIT: ది ఫస్ట్ కేస్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా దమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు విశ్వక్ సేన్. ఇక గత ఏడాది నవంబర్‌లో రిలీజ్ అయిన ‘మెకానిక్ రాకీ’ మూవీ విశ్వక్ సేన్ కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత మూడు నెలల్లోనే ‘లైలా’ మూవీని థియేటర్లలోకి తెచ్చాడు విశ్వక్ సేన్. ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్. మరి ఇంతకీ ఈ ఆకాంక్ష శర్మ ఎవరని అనుకుంటున్నారా.? ఈ అమ్మడు మహేష్ బాబుతో ఓ యాడ్‌లో కూడా నటించింది. మరి ఆ వివరాలు ఏంటో చూసేద్దాం.

‘ఇచ్చుకుందాం బేబీ’ అంటూ రిలీజ్ అయిన సాంగ్‌లో టూ పీస్ బికినీలో సెగలు రేపింది హీరోయిన్ ఆకాంక్ష శర్మ. టాలీవుడ్‌లో ఈమె కొత్త అయినప్పటికీ.. బాలీవుడ్‌లో ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది.  సింగర్ బాద్‌షాతో కలిసి పలు ఆల్బమ్స్ చేసిన ఆకాంక్ష.. హీరో టైగర్ ష్రాఫ్‌తో ‘డిస్కో డ్యాన్సర్ 2’ మూవీలో డ్యాన్స్ చేసింది. అంతేకాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సంతూర్’ యాడ్‌లో కూడా చేసింది ఈ బ్యూటీ. ఆ యాడ్‌లో కనిపించే ‘సంతూర్’ మమ్మీ మన ఆకాంక్ష శర్మనే.. ఈ సంతూర్ యాడ్ తర్వాత ఆకాంక్షను ఆఫర్లు వెతుకుంటూ వచ్చాయి. అందులో ఒకటి విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ.

ఆకాంక్షకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు, లేటెస్ట్ అప్ డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది ఈ బ్యూటీ. అవసరమైతే గ్లామర్ రోల్స్‌కి రెడీ అంటూ హింట్ ఇచ్చేసింది ఆకాంక్ష శర్మ, ‘లైలా’ మూవీలో టూ పీస్ బికినీలో అందాల ఆరబోత చేసింది. లేట్ ఎందుకు ఆమె ఫోటోలపై మీరూ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.