Soundarya: చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.! ఎవ్వరికీ తెలియని నిజం

సీనియర్ నటి నిర్మల దివంగత నటి సౌందర్యతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జయం మనదేరా షూటింగ్‌లో స్విట్జర్లాండ్‌లో సౌందర్యతో సన్నిహితంగా మెలిగిన క్షణాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సౌందర్య తన ప్రేమ, భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలను నిర్మలమ్మకు తెలిపారట. ఆ వివరాలు ఇలా..

Soundarya: చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.! ఎవ్వరికీ తెలియని నిజం
Soundarya

Updated on: Mar 22, 2026 | 3:16 PM

సీనియర్ నటి వెన్నిరా ఆదై నిర్మల దివంగత నటి సౌందర్యతో కలిసి పని చేసిన క్షణాలను, ఆమె తనతో పంచుకున్న ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సౌందర్య అకాల మరణం తనను ఎంతగానో కలిచివేసిందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్.వి.రంగారావు లాంటి సినీ దిగ్గజాలతో కలిసి పనిచేసే గొప్ప అదృష్టం తనకు లభించినప్పటికీ, అందరిలోకీ తాను సౌందర్యను ఎక్కువగా కోల్పోతున్నానని నిర్మలమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జయం మనదేరా సినిమా షూటింగ్ సమయంలో స్విట్జర్లాండ్‌కు వెళ్ళినప్పుడు సౌందర్యతో తనకు సన్నిహిత పరిచయం ఏర్పడిందని నిర్మల గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో సౌందర్య తల్లి షూటింగ్‌కు రాలేదని, దీంతో సౌందర్య తనతోనే ఎక్కువ సమయం గడిపిందని తెలిపారు. క్రమంగా వారిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడిందని, సౌందర్య తనను అమ్మ అని ఆప్యాయంగా పిలవడం మొదలుపెట్టిందని నిర్మల అన్నారు.

ఒక రోజు సౌందర్య ‘స్నేహితనే, రహసియ స్నేహితనే’ అనే పాటను పాడుతుండగా, ఆమె ఏదో రహస్యం దాస్తోందని భావించి, ఆ విషయం గురించి అడగగా, ప్రేమ వ్యవహారం గురించి సౌందర్య తనతో పంచుకుందని తెలిపారు. తన జీవితంపై, భవిష్యత్తుపై సౌందర్య ఎన్నో కలలు కన్నదని, “నేను ఇలా జీవించాలి, నాకు ఇద్దరు పిల్లలు ఉండాలి” లాంటి ఆశలను వ్యక్తం చేసిందని నిర్మల పేర్కొన్నారు. అయితే, సౌందర్యకు ప్రమాదం జరిగినప్పుడు ఆమె గర్భవతి అని తాను విన్నానని, అలాగే ఆమె తన తల్లి సోదరుడి(మావయ్య)నే ప్రేమించిందని నిర్మల వెల్లడించారు.

సౌందర్య జీవితంపై పెట్టుకున్న ఆశలు నెరవేరకముందే ఆమె మనల్ని వదిలి వెళ్లిపోవడం తనను తీవ్రమైన బాధకు గురిచేసిందని తెలిపారు. తామిద్దరం ఈ విషయాలన్నీ మాట్లాడుకున్న కొన్ని నెలలకే సౌందర్య లేకపోవడం జీర్ణించుకోలేని విషయమని ఆమె అన్నారు. ఇప్పటికీ సౌందర్య ఫోటోను పత్రికలలో చూసినా, టీవీలో ఆమె పాటలు వస్తున్నప్పుడు చూసినా తాను తీవ్రంగా కలత చెందుతానని నిర్మల విచారం వ్యక్తం చేశారు.

ఇది చదవండి: ఆ మూవీ చేయడానికి ఏఎన్నార్ భయపడ్డారు.. ఎన్టీఆర్ ముందుకొచ్చారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్

Loading...
Unable to load recommendations.
Follow Us