జవాన్..కిసాన్ ఇంతకంటే అదిరిపోయే కాంబో ఉంటుందా..?

| Edited By: Pardhasaradhi Peri

Oct 26, 2019 | 6:26 PM

వెంకటేశ్ – నాగచైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో ‘వెంకీమామ’ రూపొందింది. చైతూ జోడీగా రాశి ఖన్నా .. వెంకటేశ్ సరసన పాయల్ నటించిన ఈ సినిమా, పూర్తి వినోదభరితంగా నిర్మితమైంది. మేనమామ – మేనల్లుడు ప్రధాన పాత్రలుగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.  డి. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలు.  దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో మామా అల్లుళ్లు ఇంటెన్సీవ్ లక్‌తో అదరగొడుతున్నారు. జై […]

జవాన్..కిసాన్ ఇంతకంటే అదిరిపోయే కాంబో ఉంటుందా..?
Follow us on

వెంకటేశ్ – నాగచైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో ‘వెంకీమామ’ రూపొందింది. చైతూ జోడీగా రాశి ఖన్నా .. వెంకటేశ్ సరసన పాయల్ నటించిన ఈ సినిమా, పూర్తి వినోదభరితంగా నిర్మితమైంది. మేనమామ – మేనల్లుడు ప్రధాన పాత్రలుగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.  డి. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలు.  దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో మామా అల్లుళ్లు ఇంటెన్సీవ్ లక్‌తో అదరగొడుతున్నారు. జై జవాన్.. జై కిసాన్ అంటూ టీజర్లోనే చూపించాడు దర్శకుడు బాబీ. వెంకటేష్ రైతుగా నటిస్తుంటే.. చైతూ ఆర్మీలో వర్క్ చేస్తుంటాడు. తాజా పోస్టర్‌లో ఒకవైపు వెంకీ, మరోవైపు చైతూ ఉండగా జై జవాన్.. జై కిసాన్ అనేది హైలైట్ చేసాడు దర్శకుడు.

ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. పల్లెటూరి నేపథ్యంలో కుటుంబ విలువలు, వినోదం, పండగ వాతావరణ ప్రతిబింబించే పాటలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తే బావుంటుందనే నిర్ణయానికి చిత్రబృందం వచ్చిందట! . ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.