Sankranthiki Vasthunam: ఇరగదీసిన వెంకీ మామ.. సంక్రాంతి వస్తున్నాం ట్రైలర్ అదుర్స్..

వికటరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలుసిందే.. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు తెరకెక్కయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ను విడుదల చేశారు.

Sankranthiki Vasthunam: ఇరగదీసిన వెంకీ మామ.. సంక్రాంతి వస్తున్నాం ట్రైలర్ అదుర్స్..
Sankranthiki Vasthunnam

Updated on: Jan 06, 2025 | 8:22 PM

విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఎఫ్2, ఎఫ్ 3 సినిమాల తర్వాత వెంకీ, అనిల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  తాజాగా సంక్రాంతి వస్తున్నాం సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

అనిల్ రావిపూడి మరోసారి తన కామెడీ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అలాగే వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్. అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కామెడీతో పాటు ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉండనుంది. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రెడీ చేశారు అనిల్ రావిపూడి.

ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరోసారి వెంకటేష్ తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్ తన అభినయంతో ఆకట్టుకుంది. మరోవైపు మీనాక్షి చౌదరి తన అందంతో ఆకట్టుకుంది. వెంకటేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us