Valmiki Teaser : అరాచకం.. వరుణ్ తేజ్ చింపేశాడు భయ్యా!

|

Aug 15, 2019 | 7:43 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వాల్మీకి చిత్రం కోసం ఆడియెన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ ఫస్ట్ లుక్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో రివీల్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన టీజరైతే అదరహో అని చెప్పాలి. ‘నా సినిమాలో నా విలనే.. నా హీరో’ అంటూ అధర్వ చెప్పి డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. నయా అవతార్‌లో వరుణ్ తేజ్ రాక్ చేస్తున్నాడు.  వాల్మీకి టీజర్ […]

Valmiki Teaser : అరాచకం.. వరుణ్ తేజ్ చింపేశాడు భయ్యా!
Valmiki Teaser
Follow us on

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వాల్మీకి చిత్రం కోసం ఆడియెన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ ఫస్ట్ లుక్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో రివీల్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన టీజరైతే అదరహో అని చెప్పాలి. ‘నా సినిమాలో నా విలనే.. నా హీరో’ అంటూ అధర్వ చెప్పి డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. నయా అవతార్‌లో వరుణ్ తేజ్ రాక్ చేస్తున్నాడు.  వాల్మీకి టీజర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. కచ్చితంగా ఈ చిత్రంతో వరుణ్ తేజ్ టాలీవుడ్‌లో సంచలనాలు రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వరుణ్ లుక్స్.. ఆయన నటన సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.  అల్లు అర్జున్‌తో తీసిన ‘డీజే’ చిత్రం ప్లాప్ కావడంతో హరీష్ శంకర్ మంచి కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.

ఈ చిత్రం త‌మిళ‌నాట హిట్ అయిన జిగ‌ర్తాండ సినిమాకు రీమేక్. ఇందులో నెగిటివ్ కారెక్ట‌ర్ చేస్తున్నాడు వ‌రుణ్ తేజ్. త‌మిళ హీరో అథ‌ర్వ ముర‌ళి మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ‘వాల్మీకి’ ని సెప్టెంబరు 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.