
ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. త్వరలోనే సీజన్ 10 స్టార్ట్ కాబోతుండగా.. అందుకు ముందే సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. కొన్ని రోజులుగా అగ్ని పరీక్ష 2 ద్వారా కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేస్తున్నారు. మొదటి నుంచి ప్రోమోల ద్వారా క్యూరియాసిటిని కలిగించిన మేకర్స్.. ఇప్పుడు అగ్ని పరీక్ష2లోనూ అదే స్ట్రాటజీ వాడుతున్నారు. ఈ ఫైనల్ పోటీకి 15మందిని ఎంపిక చేశారు. అయితే అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ షో నిర్వాహకులు, జడ్జిలు బింధుమాధవి, నవదీప్, అభిజిత్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సోషల్ మీడియా ఫేమ్ ఉప్పల్ బాలు సైతం నవదీప్, బింధు మాధవిపై అనేక కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తనను నవదీప్ అవమానించాడని… తన వీడియోస్ వల్గర్ గా ఉంటాయని అన్నాడని.. మరోవైపు బింధు మాధవి తనను ట్రాన్స్ ఆ అంటూ అడిగిందంటూ చెప్పుకొచ్చాడు ఉప్పల్ బాలు. ఈ క్రమంలోనే నవదీప్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యాడు.
ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..
ఇక తాజాగా తన ఇన్ స్టాలో మరో వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పటివరకు విమర్శలు చేసిన ఉప్పల్ బాలు.. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. దయచేసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కనీసం తనను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలోకి పంపించాలని..నిర్వాహకులతోపాటు నాగార్జునను సైతం కోరారు. ఇది నా లాస్ట్ వీడియో అని.. ఛాన్స్ ఇస్తే తప్పకుండా షో రేటింగ్ పెరుగుతుందని అన్నారు. తాను బిగ్ బాస్ షోకు వెళ్లాలని తన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారని రిక్వెస్ట్ చేశాడు. ఏ టాస్క్ ఇచ్చినా తాను ఆడతానని.. ఫుల్ కామెడీ చేస్తానని ఉప్పల్ బాలు అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..
తన అభిమానులు కూడా తనకు మద్దతుగా బిగ్‌బాస్ టీమ్‌కు మెసేజ్‌లు పంపాలని విజ్ఞప్తి చేశారు. అడగడంలో తప్పు లేదు కదా అని ప్రశ్నిస్తూ, ఒక అవకాశం ఇస్తే తన సత్తా ఏంటో నిరూపించుకుంటానని వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్ల నుంచి ఉప్పల్ బాలుకు విశేష మద్దతు లభిస్తోంది. మరి ఈ విజ్ఞప్తిపై కింగ్ నాగార్జున , బిగ్‌బాస్ టీమ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‌తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..