Sanjosh : చిన్న హీరో పెద్ద సాయం.. గొత్తికోయల కోసం సంజోష్ సేవా కార్యక్రమం.

|

Jul 24, 2024 | 7:19 PM

బేవార్స్ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం‌లోని ఒక మారుమూల గ్రామం శంకర్ రాజపల్లి లో జన్మించాడు సంజోష్. పదవ తరగతి వరకు ములుగు వివేకవర్ధిని పాఠశాలలో చదువుకొని ఆతర్వాత పై చదువులన్నీ హైదరాబాద్ లో పూర్తిచేసుకుని తనలో దాగి ఉన్న టాలెంట్ ని నిరూపించుకోవడానికి సినీ ఇండస్ట్రీ వైపు అడుగులువేశాడు సంజోష్.

Sanjosh : చిన్న హీరో పెద్ద సాయం.. గొత్తికోయల కోసం సంజోష్ సేవా కార్యక్రమం.
Sanjosh
Follow us on

టాలీవుడ్ లో చిన్న హీరోల హావ కనిపిస్తుంది. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు కుర్ర హీరోలు. అలాంటి వారిలో సంజోష్ ఒకరు. బేవార్స్ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం‌లోని ఒక మారుమూల గ్రామం శంకర్ రాజపల్లి లో జన్మించాడు సంజోష్. పదవ తరగతి వరకు ములుగు వివేకవర్ధిని పాఠశాలలో చదువుకొని ఆతర్వాత పై చదువులన్నీ హైదరాబాద్ లో పూర్తిచేసుకుని తనలో దాగి ఉన్న టాలెంట్ ని నిరూపించుకోవడానికి సినీ ఇండస్ట్రీ వైపు అడుగులువేశాడు సంజోష్.

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

హీరోగా బెవర్స్ మూవీ తో తెరంగ్రేటం చేసి మంచి గుర్తింపుపొందాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. సోదర అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. కాగా  సంజోష్ వరస సినిమాలతో దూసుకుపోతూనే తనలో మంచి హీరోనే కాకుండా మంచి సేవా గుణం ఉందని నిరూపించుకున్నాడు. తను పుట్టిన నేలమ్మ తల్లి ములుగు జిల్లాకు ఎదో విధంగా సహాయం చేయాలనే దృక్పథంతో ఈ రోజు ఏటూరునాగారం మండలం చినబోయినపల్లి గ్రామ పంచాయతీలోని చింతల మోరి అనే గొత్తికోయ గుంపుకు దాదాపు 200 మందికి భోజనాలు ఏర్పాటు చేశాడు. అలాగే 30 కుటుంబాలకు 5 కేజీల బియ్యం ఒక టార్చ్ ,రెండు దోమతెరలు, ఒక బెడ్ షీట్, టవల్ ,ప్లేటు, గ్లాసు అందించాడు.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

ఇప్పటికే ముగ్గురు ప్రతిభ గల పేద చిన్నారులను చదివిస్తూ తన సేవాగుణాన్ని చాటుకుంటున్నాడు సంజోష్. మీకు ఎలాంటి అవసరం వచ్చినా నేను ఉన్నా అని మర్చిపోకండి అంటూ వారితో కలిసి భోజనం చేసి, వారి తో కొద్దిసేపు సరదాగా గడిపారు. చివరగా ఆ గ్రామ ప్రజలు ఒక వాటర్ ప్యూరిఫైయర్ కావాలని గొత్తికోయలు కోరడంతో వారికి కొద్ది రోజుల్లో పంపిస్తానని మాటిచ్చాడు సంజోష్. సంజోష్ చేసిన మంచి పనిని పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు. చిన్న హీరో అయ్యుండి ఇంత సేవ చేయడం నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్స్ సంజోష్ ను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.