Tollywood: నాటి, మేటి.. వీరికి ఎవరు సరిసాటి.. ఈ నటీమణుల అసలు పేర్లేంటో మీకు తెల్సా..?

|

Sep 24, 2022 | 6:11 PM

రంభ, రాశి, ఆమని, సౌందర్య, జీవిత.. ఈ సీనియర్ నటీమణుల అసలు పేర్లు ఏంటో మీకు తెలుసా..?

Tollywood: నాటి, మేటి.. వీరికి ఎవరు సరిసాటి.. ఈ నటీమణుల అసలు పేర్లేంటో మీకు తెల్సా..?
Follow us on

Telugu Heroins: సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది పేర్లు మారిపోతాయి. ఉదాహారణకు.. కొణిదెల శివశంకర వరప్రసాద్ పేరు కాస్తా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చిరంజీవి(Chiranjeevi) అయ్యింది. మంచు భక్తవత్సల నాయుడు కాస్తా మోహన్ బాబు(Mohan Babu) అయ్యారు. ఇలా ఇండస్ట్రీకి వచ్చాక పేరు మార్చుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు. జాతకాన్ని బట్టి.. న్యూమరాలజీని బట్టి.. లేదా అంతకుముందు అదే పేరుతో ఇంకెవరైనా ఇండస్ట్రీలో ఉన్నా కానీ పేర్లు మార్చుకుంటూ ఉంటారు. ఫలానా స్క్రీన్ నేమ్ అయితే బాగుంటుందని పరిచయం చేసే దర్శకనిర్మాతల సైతం నటీనటుల పేర్లు మారుస్తుంటారు. కాగా ఇప్పుడు మీకు కొందరు సీనియర్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలియజేయబోతున్నాం. వీరిలో ఒకరిద్దరి అసలు నేమ్స్ మీకు తెలిసి ఉండవచ్చు కానీ.. అందరివీ అయితే మీకు తెలియవని మేం పక్కాగా చెప్పగలం.

  • శ్రీదేవి: బాలనటిగా ఇండస్ట్రీలో ప్రయాణం మొదలెట్టి.. అతిలొక సుందరిగా వెలుగొందిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్‌ అయ్యప్పన్.
  • రోజా: ప్రజంట్ ఏపీ పర్యాటక మంత్రిగా ఉన్న రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. చిరంజీవి, బాలయ్య వంటి అగ్ర నటుల సరసన నటించిన రోజా.. జబర్దస్త్ జడ్జిగా సైతం మంచి పేరు తెచ్చుకున్నారు.
  • సౌందర్య : దివంగత సౌందర్య తెలుగమ్మాయి కాదు అంటే ఎవరూ నమ్మరు. వాస్తవానికి ఆమెది కర్ణాటక. దక్షిణాదిలోని అగ్ర హీరోలందరితో నటించి.. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సౌందర్య.. ఓ ఎయిర్ క్రాప్ట్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈమె అసలు పేరు  సౌమ్య.
  • ఆమని: కుటుంబ కథా చిత్రాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఆమనిది ఏపీలోని నెల్లూరు. ఆమె అసలు పేరు మంజుల.
  • రాశి : రాశి అంటే అప్పట్లో అబ్బాయిలు వెర్రెత్తిపోయేవారు. గ్లామర్ పాత్రలు వేసినా.. కుటుంబ కథల్లో మెరిసినా.. ఆమె శైలి భిన్నం. రాశి అసలు పేరు విజయలక్ష్మి.
  • జీవిత: నటిగా, దర్శకురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చెరిగిపోని ముద్ర వేశారు జీవితా రాజశేఖర్. ఈమె అసలు పేరు పద్మ.  శ్రీశైలంలో పుట్టారు జీవిత.
  • జయసుధ: హీరోయిన్‌గా తొలితరం నటులకు బెస్ట్ ఆప్షన్ జయసుధ. ఆ తర్వాత అమ్మ పాత్రల్లోనూ అంతే స్థాయిలో రాణించారు. సహజనటి అనే బిరుదు అందుకున్న జయసుధ అసలు పేరు సుజాత.
  • జయప్రద :  ఈమె అసలు పేరు లలితారాణి. మన  రాజమండ్రిలోనే జన్మించారు.
  • రంభ: పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి.. గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రంభ అసలు పేరు విజయలక్ష్మి. ఈమె సొంతూరు విజయవాడ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.