తెలుగులో స్టార్ హీరో.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్..! చనిపోయాక డెడ్ బాడీని మార్చురీ‌లో ఓ మూలన పడేశారు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి స్టార్స్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఒకప్పుడు స్టార్స్ గా రాణించిన చాలా మంది హీరోలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

తెలుగులో స్టార్ హీరో.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్..! చనిపోయాక డెడ్ బాడీని మార్చురీ‌లో ఓ మూలన పడేశారు
Hero

Updated on: Jun 30, 2026 | 2:44 PM

సినిమా ఇండస్ట్రీలో అతను ఓ స్టార్ హీరో, తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ను ఎక్కువగా సంపాదించుకున్నాడు ఆ హీరో. వరుస హిట్స్ తో టాలీవుడ్ లో తోప్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఫ్లాప్స్ అందుకున్నాడు.. మెల్లమెల్లగా అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు. కానీ మానసిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకొని ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. ఆ హీరో ఎవరో ఇప్పటికే మీరు కనిపెట్టేసి ఉంటారు.  అయితే ఆ హీరో గురించి ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆ హీరో మృతదేహం చూసి మ్యూజిక్ డైరెక్టర్ చెలించిపోయారట. స్టార్ హీరోగా రాణించిన ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు అని ఎమోషనల్ అయ్యారు ఆ మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకూ ఆ స్టార్ హీరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని రాణించాడు హీరో ఉదయ్ కిరణ్. స్టార్ హీరో అవుతాడనుకున్న ఉదయ్ కిరణ్.. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు హీరో ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆయన పేరు చెప్తే తెలియకుండానే కన్నీరు వస్తుంది. లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ తక్కువ కాలంలోనే స్టార్ గా ఎదిగాడు. వరుస విజయాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఉదయ్. లవ్ స్టోరీలకు ఉదయ్ పెట్టింది పేరు. చిత్రం సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఉదయ్ కిరణ్. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, నీ స్నేహం, శ్రీరామ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

దాంతో ఉదయ్ ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోయింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరయ్యాడు ఉదయ్. అయితే ఆ తర్వాత ఉదయ్ చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం మొదలైంది.. అలాగే చిన్న చిన్నగా అవకాశాలు తగ్గడంతో మనస్థాపానికి గురయ్యాడు ఉదయ్. తన సహా నటులు వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఉదయ్ కు మాత్రం ఛాన్స్ లు రాలేదు. దాంతో మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఉదయ్ కిరణ్ మరణ వార్త ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. కాగా ఉదయ్ కిరణ్ గురించి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన వార్త తెలియగానే హాస్పటల్ కు వెళ్ళాను ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు. అక్కడ ఎవ్వరూ లేరు. ఎంత పెద్ద హీరో.. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అలా మూలన పడున్నాడే అని చాలా భాద పడ్డాను అని అన్నారు ఆర్ఫీ. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us