Tollywood: ఇంత మంచితనం ఏంటండీ బాబు.. ఇంట్లో పడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన యాక్టర్..

|

Apr 18, 2024 | 5:17 PM

ఈ నటుడి నేచర్ చాలా విభిన్నం. ఆయన ఆలోచన తీరు.. ఇంకో 10, 15 సంవత్సరాలు ఫార్వార్డ్ ఉంటుంది. ఆయన ఇతరులకు హెల్ప్ చేయడంలో సంతృప్తి వెతుక్కుంటారు. సమాజంలోని చాలా రుగ్నతలపై బహిరంగంగానే వాయిస్ వినిపిస్తూ ఉంటారు. ఒకప్పుడు మంచి హీరో. ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. కానీ ఎప్పడూ మంచి మనిషి...

Tollywood: ఇంత మంచితనం ఏంటండీ బాబు.. ఇంట్లో పడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన యాక్టర్..
Tollywood Actor
Follow us on

టాలీవుడ్‌లో గొప్ప నటులు ఉన్నారు. అలానే గొప్ప మనుషులు ఉంటారు. కుడి చేత్తో చేసిన సాయం.. ఎడమ చేతికి తెలియకూడదు అనుకుంటారు. అలాంటివారిలో దివంగత శ్రీహరి గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఎన్నో గుప్త ధానాలు చేసి జనాల మనసుల్లో ప్లేస్ సంపాదించుకున్నాడు. అదే కోవలో చెందిన మరో వ్యక్తి జగపతి బాబు. ఒకప్పుడు కథానాయకుడు. ఇప్పుడు రోల్ నచ్చితే ఏ పాత్రైనా చేసేస్తున్నారు. సినిమాలు పక్కన బెడితే ఆయనది బయట చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన ఆలోచనా ధోరణి చాలా ఫార్వార్డ్‌గా ఉంటుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. తనకు అనిపించింది చేసేస్తారు. సొసైటీలోని చాలా అసమానతలపై ఆయన గట్టిగానే వాయిస్ వినిపిస్తారు. తన జీవితంలోని ఎత్తు పల్లాల గురించి కూడా జగ్గూ భాయ్ ఓపెన్‌గా చెప్పేస్తారు. చేసిన సినిమాలు ప్లాఫ్ అయితే.. నిర్మాతలకు రెమ్యూనరేషన్ డబ్బు వెనక్కి పంపేవారు. ఇక ఎవరైనా సాయం అంటే చాలు.. మరోసారి ఆలోచించకుండా తనకు అయినంతవరకు చేసేస్తారు.

ఆయన మంచితనం గురించి చెప్పాలంటే.. మీకు ఓ ఘటన గురించి వివరించాలి. జగపతి బాబు నివాసంలో ఓ సారి దొంగలు చోరికి యత్నించారు. ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే ఎలా పట్టుకున్నారో ఏమో.. ఆ దొంగల భార్యలు జగపతి బాబు ఫోన్ నంబర్ సంపాదించారు. ఆపై ఫోన్ చేసి.. తాము పిల్లలతో రోడ్డున పడ్డామని కన్నీటి పర్యంతమయ్యారట. దీంతో ఆ దొంగల ఫ్యామిలీలకు డబ్బు సాయం చేశారు జగ్గూ భాయ్. అది కూడా ఒక్కసారి అంటే పొరపడినట్లే. ఆ దొంగలు జైలు నుంచి విడుదల అయ్యేవరకు.. వారి ఫ్యామిలీలకు నెల నెలా ఖర్చుల కోసం డబ్బులు పంపారట. ఈ విషయాన్ని తానే ఓ ఇంటర్య్వూలో స్వయంగా చెప్పారు జగపతిబాబు. నిజంగా ఇలాంటి మనుషులు ఈ సమాజంలో అరుదనే చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.