Titanic Movie: ‘టైటానిక్’ సినిమాలో హీరోయిన్ రోజ్ ప్రాణాలను కాపాడిన డోర్ వేలం.. ఎన్ని కోట్లకు అమ్ముడయ్యిందంటే..

|

Mar 29, 2024 | 9:29 AM

1997లో విడుదలైన ఈ సినిమా జనాలకు బాగా నచ్చింది. ఈ సినిమా పేరు చెప్పగానే దాదాపు 1500 మంది మృత్యువాత పడిన విషాద ఘటనతోపాటు.. అద్భుతమైన ప్రేమకావ్యం కళ్లముందుకు వస్తుంది. ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ అద్భుతంగా నటించారు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జనాల నుంచి నేటికీ విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

Titanic Movie: టైటానిక్ సినిమాలో హీరోయిన్ రోజ్ ప్రాణాలను కాపాడిన డోర్ వేలం.. ఎన్ని కోట్లకు అమ్ముడయ్యిందంటే..
Titanic Movie
Follow us on

ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని విషాద ప్రయాణం టైటానిక్. ఈ భయంకర ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. ఈ ప్రమాద ఘటన ఆధారంగా రూపొందించిన సినిమా టైటానిక్. 1997లో విడుదలైన ఈ సినిమా జనాలకు బాగా నచ్చింది. ఈ సినిమా పేరు చెప్పగానే దాదాపు 1500 మంది మృత్యువాత పడిన విషాద ఘటనతోపాటు.. అద్భుతమైన ప్రేమకావ్యం కళ్లముందుకు వస్తుంది. ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ అద్భుతంగా నటించారు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జనాల నుంచి నేటికీ విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ హాలీవుడ్ చిత్రం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే ఈ చిత్రం ఎన్నో ఆస్కార్ అవార్డులను అందుకుంది. ఈ సినిమాలో హైలెట్ సీన్ అంటే రోజ్ కోసం కేట్ జాక్ తన ప్రాణాలను వదిలేస్తాడు. తన ప్రియురాలిని రక్షించేందుకు ఆమెను ఓ తలుపుపై ఉంచి.. అతడు మాత్రం గడ్డ కట్టే చల్లని నీటిలో ఉండిపోతాడు. ఇప్పటికీ ఆ సన్నివేశం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. తాజాగా రోజ్ ప్రాణాలను కాపాడిన తలుపును వేలం వేసినట్లుగా తెలుస్తోంది.

నివేదికల ప్రకారం.. రోజ్ ప్రాణాలను రక్షించడంలో ప్రసిద్ధి చెందిన తలుపు ఇటీవల వేలం వేసినట్లుగా తెలుస్తోంది. ఆ ఫ్లోటింగ్ డోర్ 718,750 డాలర్లు అంటే (రూ. 5,98,92,107) సుమారు రూ. 6 కోట్లకు అమ్ముడయ్యింది. హెరిటేజ్ ఆక్షన్ ట్రెజర్స్ లో ఈ తలుపు అత్యధిక వసూలు సాధించిన వస్తువుగా నిలిచింది. నిజానికి ఈ తలుపును సందర్శకులు చెక్క పలకగా భావించారు. కానీ అది ఓడ ఫస్ట్ క్లాస్ లాంజ్‌కి ప్రవేశ ద్వారం పైన ఉన్న ఫ్రేమ్‌లో భాగమని దానిని తలుపుగా చూపించామని మూవీ టీం వెల్లడించింది. దీంతో పాటు ఆ సీన్‌లో కేట్ విన్స్లెట్ అంటే రోజ్ ధరించిన డ్రెస్ అది కూడా వేలం వేయబడింది. రోజ్ ధరించిన షిఫాన్ దుస్తులు కూడా 125,000 డాలర్లకు అంటే (1,04,17,143.75) రూ.1 కోటికి పైగా అమ్ముడయ్యాయి.

అయితే ఈసినిమా తర్వాత డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కు అనేక ఈమెయిల్స్ వచ్చాయట. ఈ సన్నివేశాన్ని చూసిన అడియన్స్ రోజ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారని జేమ్స్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రోజ్ స్వార్థపరురాలు అని అన్నారని.. అలాగే ఆమెను కాపాడి.. రాత్రంతా గడ్డకట్టే చలిలో ఉన్న జాక్ నిజమైన మూర్ఖుడు అంటూ మెయిల్స్ పంపించారని అన్నారు. కానీ ఈ విమర్శలకు జేమ్స్ స్పందిస్తూ.. తాను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం సినిమాలో జాక్ చనిపోవాల్సిందేనని చెబుతూ ఈ చర్చకు ముగింపు పలికారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.