‘ఇది మ‌హిళ‌లంద‌రూ గ‌ర్వ‌ప‌డే సంద‌ర్భం’

|

Aug 12, 2020 | 8:05 PM

డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా వెస్ ప్రెసిడెంట్ పదవికి అభ్యర్థిగా బ‌రిలోకి దిగ‌బోతున్న‌ కమలా హ్యారిస్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇది మ‌హిళ‌లంద‌రూ గ‌ర్వ‌ప‌డే సంద‌ర్భం
Follow us on

డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా వెస్ ప్రెసిడెంట్ పదవికి అభ్యర్థిగా బ‌రిలోకి దిగ‌బోతున్న‌ కమలా హ్యారిస్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఫొటోను షేర్ చేసి, ఈ నిర్ణ‌యం మహిళలకు గర్వకారణమంటూ పేర్కొన్నారు.

‘అన్ని వర్ణాలకు చెందిన విమెన్స్‌, దక్షిణాసియా మహిళలు, నల్లజాతీయ మహిళలు..ఇది మహిళలందరూ ఫ్రౌడ్‌గా ఫీల‌య్యే సందర్భం. ఈ పదవికి పోటీ పడుతోన్న మొదటి ఇండియ‌న్, నల్లజాతీయురాలైన కమలా హ్యారిస్‌కు శుభాకాంక్ష‌లు ‘ అని ప్రశంసించారు.

మరో ప్రవాస భారతీయురాలు, టీవీ హోస్ట్, చెఫ్ పద్మాలక్ష్మి కూడా త‌న ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. ‘ఓం శాంతి! ఫైన‌ల్‌గా శ్వేత‌సౌధంలో కొంత ప్రాతినిధ్యం లభించింది. కమలా హ్యారిస్‌ ఎంపిక చాలా గొప్ప‌ది. ట్రంప్‌, పెన్స్‌, ప్రస్తుత కేబినెట్‌లోఉన్న అంద‌రికంటే ఆమె తెలివైనది’ అని పోస్టు చేస్తూ హ్యారిస్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు.

 

Also Read : కరోనాతో ప్ర‌ముఖ‌ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి