Pawan Kalyan: డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన మూడు సినిమాల్లో నటించారు. హరి హరి వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేశారు పవన్. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉంటున్నారు.

Pawan Kalyan: డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్
Pawan Kalyan

Updated on: Jun 30, 2026 | 3:59 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాజకీయాల్లోకి దిగిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాల్లో ఉంటూనే భీమ్లానాయక్ , వకీల్ సాబ్, బ్రో, హరిహరవీరుమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేసి అలరించారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్  హరిహరవీరుమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటిలో ఓజీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

ఇదిలా ఉంటే త్వరలోనే ఓజీ 2 రానుందని ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఓజీ 2 గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓజీ 2లో ఓ క్రేజీ హీరోయిన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ పూజా హెగ్డే. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. బడా హీరోల సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

అయితే కొంతకాలంగా ఈ చిన్నదానికి అదృష్టం కలిసి రావడం లేదు. పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ పూజా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. దాంతో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ వైపు టర్న్ అయ్యింది. కూలి సినిమాలో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూజకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. గతంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజా నటించాల్సింది. కానీ ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు ఓజీ 2లో పూజా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us