Viral Photo: చిరునవ్వుల చిన్నారి.. నాన్న ఒడిలో స్టైల్‌గా పోజులిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో కనిపెట్టండి..

|

Mar 16, 2022 | 1:24 PM

టైటిల్ చూసి షాక్ అవ్వొద్దు.. అసలు విషయానికొచ్చేస్తా.. పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. టాలీవుడ్‌లో చేసింది..

Viral Photo: చిరునవ్వుల చిన్నారి.. నాన్న ఒడిలో స్టైల్‌గా పోజులిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో కనిపెట్టండి..
Tollywood
Follow us on

టైటిల్ చూసి షాక్ అవ్వొద్దు.. అసలు విషయానికొచ్చేస్తా.. పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే. కానీ అందంతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ అప్‌డేట్స్, రీసెంట్ ఫోటోస్‌ను తన ఫ్యాన్స్‌కు షేర్ చేస్తుంటుంది. ఎవరో గుర్తొచ్చిందా.? ఇంకా కనిపెట్టలేకపోయారా.! అయితే మీకో క్లూ ఇస్తాం.

ఈ అందాల భామ ఓ కల్ట్ క్లాసిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికైనా మీకు అర్ధమై ఉంటుంది. సరే ఈ ముద్దుగుమ్మ ‘100% లవ్’ రీమేక్‌తో తమిళంలో డెబ్యూ చేసింది. ఎస్ మీరనుకునేది కరెక్టే.. ఆమెవరో కాదు షాలినీ పాండే.

థియేటర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన షాలినీ పాండే.. 2017లో విజయ్ దేవరకొండ- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ తర్వాత ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాల్లో క్యామియో రోల్స్ చేసిన షాలినీ.. ‘118’ మూవీతో మరో సక్సెస్ అందుకుంది. అటు అందం.. ఇటు నటనతో ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత తెలుగులో షాలినీకి పెద్దగా సక్సెస్ దక్కలేదు. ప్రస్తుతం ‘జయేష్‌భాయ్ జోర్దార్’, ‘మహారాజా’ సినిమాలతో హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.