Singer: ఈ సింగర్ మనసు బంగారం.. 3 వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ..

|

Jul 17, 2024 | 9:05 PM

ఇప్పటివరకు మూడు వేల మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు ఆ సింగర్ మంచి మనసు తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఇంతకీ ఆమె ఎవరంటే సింగర్ పాలక్ ముచ్చల్. సినిమాల్లో తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్దులను చేయడమే కాదు.. చిన్నారుల పాలిట దైవంలా మారింది. చిన్నారుల గుండె ఆగిపోకుండా తన సొంతంగా చికిత్స చేయిస్తుంది

Singer: ఈ సింగర్ మనసు బంగారం.. 3 వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ..
Palak Muchhal
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ హీరో అన్న సంగతి తెలిసిందే. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈ హీరో.. అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ఇప్పటివరకు ఎంతో మంది చిన్నారులకు హార్డ్ ఆపరేషన్స్ చేయించారు. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచి మరో జన్మను అందించారు. కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు..మరో సింగర్ కూడా ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను నిలిపేందుకు పోరాడుతుంది. ఇప్పటివరకు మూడు వేల మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు ఆ సింగర్ మంచి మనసు తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఇంతకీ ఆమె ఎవరంటే సింగర్ పాలక్ ముచ్చల్. సినిమాల్లో తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్దులను చేయడమే కాదు.. చిన్నారుల పాలిట దైవంలా మారింది. చిన్నారుల గుండె ఆగిపోకుండా తన సొంతంగా చికిత్స చేయిస్తుంది.

ఇప్పటివరకు దాదాపు 3 వేల మంది నిరుపేద చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. తన పాటలు ప్రాచూర్యం పొందడంతో ఆదాయం పెరిగిందని.. ఒక్క కాన్సార్ట్ తో 13- 14 ఆపరేషన్లకు సరిపడా నిధిలు సేకరిస్తున్నానని సింగర్ పాలక్ ముచ్చల్ వెల్లడించారు. మరో 400 మంది కంటే ఎక్కువ చిన్నారులకు గుండె ఆపరేషన్స్ జరగాల్సి ఉందని.. తన సంపాదిన వారికోసమే ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకొచ్చింది. చిన్నారుల ప్రాణాలను కాపాడడంలోనే తనకు అసలైన ఆనందముందని అంటోంది. పాలక్ ముచ్చల్.. ఇప్పుడిప్పుడే సినీరంగంలో గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన పాలక్ ముచ్చల్.. చిన్నవయసు నుంచి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు తనవంతుగా నిధులు సేకరిస్తుంది. ఇందుకోసం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ స్టేజ్ షోలను ఇస్తూ నిధులు సేకరిస్తుంది. ఆ డబ్బుతోనే చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తుంది. పాలక్ ముచ్చల్ హిందీలో అనేక సినిమాల్లో పాటలు పాడింది. ఏక్ థా టైగర్, ఆషికి 2, కిక్, యాక్షన్ జాక్సన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఎంఎస్ ధోని, కాబిల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో పాటలు పాడింది. ఇక ఇప్పుడు పాలక్ ముచ్చల్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.