Tollywood: అలాంటి సీన్స్ చేయకపోవడం వల్లే ఆఫర్స్ పోయాయి.. కిస్ సీన్ చేయాలంటే ఏడ్చేసిన హీరోయిన్..

|

Jul 02, 2024 | 9:03 PM

దం, టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడం.. శ్రుతి మించి గ్లామర్ షో ఉండడంతో ఎన్నో ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నారు. అయితే వారికి కొన్నేళ్లకు అసలు ఎలాంటి అవకాశం రాదని అంటున్నారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతుంది శ్రుతి శర్మ. ఇటీవల ఓటీటీలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ హిరామండిలో కీలకపాత్రలో కనిపించింది.

Tollywood: అలాంటి సీన్స్ చేయకపోవడం వల్లే ఆఫర్స్ పోయాయి.. కిస్ సీన్ చేయాలంటే ఏడ్చేసిన హీరోయిన్..
Heroine
Follow us on

ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్‏కు దూరంగానే ఉంటున్నారు. లిప్ లాక్, కిస్ నుంచి గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగానే ఎంతో మంది తారలు ఆఫర్స్ కోల్పోతున్నారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడం.. శ్రుతి మించి గ్లామర్ షో ఉండడంతో ఎన్నో ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నారు. అయితే వారికి కొన్నేళ్లకు అసలు ఎలాంటి అవకాశం రాదని అంటున్నారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతుంది శ్రుతి శర్మ. ఇటీవల ఓటీటీలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ హిరామండిలో కీలకపాత్రలో కనిపించింది. 2018 నుంచి టీవీలో పాపులర్ క్యారెక్టర్ పోషిస్తుంది. గత్ బంధన్ షోతో నటిగా కెరీర్ ప్రారంభించింది.

ఆ తర్వాత ఇండియాస్ నెక్ట్స్ సూపర్ స్టార్స్ షోలో పాల్గొంది. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంలో కనిపించింది. అలాగే పగ్లైట్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవల హిరామండి సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి మాట్లాడుతూ.. తనకు రొమాంటిక్ సీన్స్ చేయడం, స్క్రీన్ పై ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని తెలిపింది. ఎప్పటికీ తాను స్క్రీన్ పై రొమాన్స్ సీన్ చేయనని.. అందుకే ఎన్నో ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే తన నిర్ణయం గురించి బాధపడడం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రుతి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హిరామాండి వెబ్ సిరీస్ లో శ్రుతి షామా అనే పనిమనిషి పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసు అందుకుంది. హిరామండి సిరీస్ లో శ్రుతి మొదటిసారి కిస్ సీన్ లో నటించింది. షూటింగ్ కంటే ముందు స్క్రిప్ట్ మొత్తం చదివిన శ్రుతి కిస్ చేయాల్సి రావడంతో ఏడ్చేసింది. కానీ ఆ తర్వాత ఆ సీన్ చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిపింది. హిరామండి సక్సెస్ తర్వాత తనకు ఆఫర్స్ వస్తున్నాయని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.